ఓ మగువా మేలుకో నీ బలం తెలుసుకో??

ఓ మగువా మేలుకో నీ బలం తెలుసుకో??
నిప్పులా పైకెగరరాదా?
కార్చిచ్చుల కామాంధుని దహించరాదా ?
తల్లీ గర్భమున ఎవ్వరైనా ఒక్కటేగా
పొత్తిళ్లలో పాలు తాగిన నాడు వాడి బలము నీ బలము ఒక్కటేగా
అది నువ్వు మరచిపోతే ఎలాగా?
నిన్ను నువ్వు అబలవని తక్కువ చేసుకుంటే ఎలాగా?
వీర మహిళల ధీర గాధలు వినలేదా?
కత్తి పట్టి కదనరంగాన కాలు దువ్విన కాకతీ రుద్రమ నువ్వు కాలేవా?
పసి బాలుని వీపుకట్టి వసివాడని ధైర్యం తో పోరాడిన వీర ఝాన్సీ నువ్వు కాలేవా?
కన్ను మిన్ను గానని వాడి ఖండలను నీ పంటి కోరలతో పీకలేవా?
మద పిచ్చి తో నిన్ను జేరిన వాడి పురుషహంకారం పగిలి పోయేలా ఎగిరి తన్నలేవా?
కదులుతున్న రైలు దూకి నిన్ను నువ్వు హింస పెట్టుకొని రక్షించుకుంటున్న అనుకుంటివా?
ఎంత అమాయకత్వం?
ఎంత బేల తనం?
ఎన్ని నిర్భయలు,
ఎన్ని అభయలు జరగాలి?
ఎంత ఘోరకలి ని చూడాలి? ఆపండి!!
ఈ అసహాయతను
ఆపండి!!
ఈ ఆశక్తతను
ఓ మగువా !!
ఇకనైనా మేలుకో!!
ఉక్కు పిడికిలి బిగించి ఆత్మ రక్షణ ఆయుధాలను చేతబూను.
విద్య తో పాటు
స్వీయ రక్షణ సామర్త్యాన్ని సముపార్జించు
నీ దేహ దారుడ్యం
శత్రు దుర్భేద్యం లా
మలచుకొని ఆత్మ గౌరవం తో సాగిపో......
భీమానాతి శారద ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, కవయిత్రి
కరీంనగర్