అడ్డగూడూరులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బిక్షటన
అడ్డగూడూరు 08 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదలకు జాప్యం ఎందుకు?ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో బడుగు,బలహీన,వర్గాల విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు ఓటు హక్కు లేదని నిర్లక్ష్యమా? జూబ్లీహిల్స్ లో మీరు ఓటు అడుక్కుంటుంటే అడ్డగూడూరులో విద్యార్థి బిక్షటన చేసే పరిస్థితి ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థి గెరిల్లా యుద్ధాన్ని ప్రకటిస్తాం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అడ్డగూడూరులో ఫీజు బకాయిలు విడుదల చేయాలని నిరసిస్తూ బిక్షటన చేయడం జరిగింది.ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ డిమాండ్. శుక్రవారం రోజు సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు నియంబర్స్మెంట్ విడుదల చేయాలని,ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలలు నిరవధిక బందు పాటిస్తున్న ప్రభుత్వం స్పందించకుండా విజిలెన్స్ దాడులు చేస్తా అనటం సిగ్గుచేటని రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ అడ్డగూడూరు మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి పీజ్ బకాయిల కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బిక్షాటన చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 వేల కోట్ల ఫీజు బకాయిల విడుదల చేయాలని లేని పక్షంలో విద్యార్థి లోకంతో మంత్రుల నివాసాలు ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు చిప్పలపల్లి వంశీ కుమార్,బెల్లి శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు తరాల మధు సాయికుమార్ బన్నీ, సన్నీ, అఖిల్, లక్ష్మీ సాయి,ముకేష్, తదితరులు పాల్గొన్నారు.