అఖిల భారత కిసాన్30వ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు

Apr 13, 2025 - 22:41
Apr 13, 2025 - 23:17
 0  5
అఖిల భారత కిసాన్30వ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి

తెలంగాణ వార్త మిర్యాలగూడ ఏప్రిల్ 13 :- అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రం నాగ పట్టణంలో 2025 ఏప్రిల్ 15 16 17 తేదీలలో జరుగుఅఖిల భారత కిసాన్ సభ 1936 ఏప్రిల్ 11 న లక్నోలో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు రైతాంగం ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా ఉద్యమిస్తూ పోరాడుతున్న అతిపెద్ద రైతు సంస్థ అఖిల భారత కిసాన్ సభదేశ స్వాతంత్య్ర సాధన కుతెలంగాణ సాయుధ పోరాటంలో భూమికోసంభుక్తి కోసంవెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోపశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తె భాగ ఉద్యమంలోకేరళ రాష్ట్రంలో పున్న రైతాంగ ఉద్యమంలో ఇతర అనేక రాష్ట్రాలలో రైతాంగ సమస్యలపై జరిగిన ఉద్యమాలలో పోరాటాలలో రైతులకు నాయకత్వం వహించింది అఖిల భారత కిసాన్ సభదున్నేవాడికే భూమి కావాలనిరక్షిత కౌలు దారుల చట్టం కోసం పోరాడి సాధించింది. భూ సంస్కరణలు భూ సేకరణ 2013 చట్టం, ఆహార భద్రత చట్టంగ్రామీణ ఉపాధి హామీ పథకం పంటలకు మద్దతు ధరలు సాధించటంలో జరిగిన పోరాటాలలో అగ్రగామి పాత్రను అఖిలభారత కిసాన్ సభ నిర్వర్తించింది. ఇటీవల ఢఢబీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ పాలకులు తెచ్చిన మూడు రైతు వ్యతిరేక కేంద్ర చట్టాలను రద్దు చేయాలని సాగిన చారిత్రాత్మక ఉద్యమంలో అఖిల భారత కిసాన్ సభ కీలకమైన పాత్రను నిర్వర్తించిందిపంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కావాలని రుణమాఫీ చట్టం చేయాలని పంటల బీమా పథకాన్ని రైతులకు అనుకూలంగా సవరించి అమలు చేయాలని తదితర డిమాండ్లపై దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలలో రైతులను సమీకరించుకొని పోరాడుతుంది. కౌలు రైతులుమహిళ రైతులు, పాల రైతులు, పంటల వారీగా రైతులను  ఏకం చేసి సంఘటితం చేసి రైతుల హక్కుల పరిరక్షణకు దేశ ప్రజలహార భద్రతకు నిరంతరంగా పోరాడుతున్న అఖిల భారత కిసాన్ సభ 30వ మహాసభలను నాగపట్నం లో నిర్వహించుకుంటున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో  జాత నిర్వహిస్తున్నాం దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అఖిల భారత కిసాన్ సభ 30వ జాతీయ మహాసభలు వేదిక కానున్నాయి. మహాసభలో చర్చల అనంతరం తీసుకుపోయే భవిష్యత్తు కార్యచరణ దేశ రైతాంగానికి మార్గదర్శకం కానున్నది. ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా  కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పద్మ, ఉపాధ్యక్షులు ప్రభు లింగం, సహాయ కార్యదర్శి సంధ్య, కోశాధికారి నరేంద్ర ప్రసాద్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, స్వరూప, మేడ్చల్ జిల్లా కార్యదర్శి నిమ్మల నరసింహ, సుభాన్ రెడ్డి, సుధాకర్ గౌడ్, సహాయ కార్యదర్శి బిల్లా కనకయ్య, సిపిఐ మండల కార్యదర్శి ఎండి సయ్యద్, లింగా నాయక్, వేములపల్లి మండల కార్యదర్శి జిల్లా యాదగిరి, అంజనపల్లి రామలింగం, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు వల్లంపట్ల వెంకన్న, పద్మ, దుర్గమ్మ, షమీం, అంజమ్మ, రాములమ్మ, శ్రీనివాసరాజ్, జమీన్, దాసు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333