అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

Aug 13, 2025 - 18:46
Aug 13, 2025 - 19:45
 0  4
అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో  విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ క్రీడా దుస్తులు అందజేయడం అభినందనీయం అక్షర ఫౌండేషన్ సూర్యాపేట ఆధ్వర్యంలో వంగేటి చెన్నారెడ్డి జ్ఞాపకార్థం వారి మనవడు వంగేటి కేశవరెడ్డి గారి సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పది వేల విలువగల క్రీడా దుస్తులు అక్షర ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రుద్రంగి కాళిదాసు గారు అందజేశారు. కాళిదాసు గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యమని అది క్రీడల వల్లనే సాధ్యమని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ గారు మాట్లాడుతూ క్రీడల వలన విద్యార్థులలో చురుకుదనం, జిజ్ఞాస, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతత కలుగుతుందని, చదువులలో కూడా రాణించగలరని తెలిపారు. విద్య, వైద్య, క్రీడా, సాంస్కృతిక, సామాజిక రంగాలలో విశేష సేవలందిస్తున్న అక్షర ఫౌండేషన్ ను ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వాడపళ్ళి మురళీకృష్ణ , దాత వంగేటి కేశవరెడ్డి, కందాల వెంకటరెడ్డి, ఒంగేటి రామచంద్రారెడ్డి, భూతం లింగయ్య, శిగ శ్రీనివాస్, బొల్లం కృష్ణయ్య,వనమాల శ్రీనివాస్, కిషన్ సింగ్, యాస మల్లారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు బి. శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు