అక్రమంగా మట్టి తరలింపు పట్టించుకోని అధికారులు

May 24, 2025 - 20:38
May 24, 2025 - 20:49
 0  8
అక్రమంగా మట్టి తరలింపు పట్టించుకోని అధికారులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ :- అక్రమంగా మట్టి తరలింపు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునేవారు లేరు. రోడ్లన్నీ గుంతల మయంగా మారిన తీరు. ఆత్మకూర్ ఎస్... మండల పరిధిలోని దుబ్బ తండ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబిలు టిప్పర్లతో భారీగా మట్టి తరలిస్తున్నారు. పెద్ద కొద్దిరోజులుగా సమీపంలోని వెంచర్లకు రైస్ మిల్ నిర్మాణం కోసం ఈ మట్టిని తరలిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ టిప్పర్ల కారణంగా రోడ్లు పాడవుతున్నాయని అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ అలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుబ్బ తండాకు చెందిన ఒక జెసిబి యజమాని ఈ మట్టి దందా చేస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. పంట పొలాల మట్టితో పాటు అప్పుడప్పుడు ఎస్సారెస్పీ కాలువ మట్టిని కూడా తరలిస్తున్నారని స్థానికలు ఆరోపించారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాహసిల్దార్ వివరణ. మండల పరిధిలో దుబ్బ తండాలో అక్రమంగా మట్టి తరలిస్తున్న విషయమై తాహసిల్దార్ హరి కిషోర్ శర్మను వివరణ కోరగా మట్టి తరలింపు పైతమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసుల సహకారంతో వెంటనే మట్టి తరలింపు ను అరి కడతామని వివరణ నిచ్చారు