బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 5%శాతం నిధులు కేటాయించాలి

Feb 25, 2026 - 20:25
 0  19
బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 5%శాతం నిధులు కేటాయించాలి

జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సురుపంగ ప్రకాష్,వనం ఉపేందర్
భువనగిరి 25 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి స్వరూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వికలాంగుల పెన్షన్ 6వేల ఇస్తామని రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు పెన్షన్ గురించి ఆలోచన చేయకపోవడం వికలాంగుల పక్షాన వాళ్లకు ఉన్న వివక్ష  తెలియ వస్తుంది. వికలాంగుల పెన్షన్ 6వేల పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. వికలాంగుల పరిరక్షణ చట్టం 2016 అమలు చేసి వికలాంగులకు సంక్షేమ పథకాలలో అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాలని మాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి ఆమె పథకాన్ని యధావిధిగా ఉంచాలని విబి జి రామ్ జీ స్కీమును రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు అందిస్తున్న సహాయ పరికరాల యందు నోటరీ అబ్డేవిట్ రద్దు చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి ఉపాధ్యక్షులు శ్యాంసుందర్ జిల్లా నాయకులు కీసర వెంకటరెడ్డి గొడుగు దాసు నాగు నరసింహ పున్న శ్రీధర్ శివగల రాములు ఏషాల గోపి పర్వతం సాలమ్మ గర్దాసు సత్తయ్య యాట చందు హరిబాబు మంచాల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333