అండర్ -17 రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ క్రీడకు ఎంపిక

Nov 21, 2025 - 15:38
 0  18
అండర్ -17 రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ క్రీడకు ఎంపిక

 జోగులాంబ గద్వాల 21 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ ఎంపిక అయినా 10వ తరగతి పి.శివను అభినందించిన పాఠశాల డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి...!!

ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్ విద్యార్థి శివ 10వ తరగతి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తరఫున బాస్కెట్బాల్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని SGF- 69 ఎస్.ఆర్.విద్యానికేతన్ పాఠశాల నందు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బాస్కెట్బాల్ క్రీడాకారులను ఎంపికలో భాగంగా క్రీడాకారులను ఉత్తమ క్రీడాను కనపరిచిన వారిని జిల్లా తరఫున ఎంపిక చేసుకోవడం జరిగినది. అందులో భాగంగా ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాల కు చెందిన విద్యార్థి పి శివ ఇట్టి ఎంపిక పట్ల ఆనందం వ్యక్తం చేసిన పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి...! పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు వేటీపై మక్కువ ఉందొ వాటిని మనం అందించడంలో ముందు ఉంటే విద్యార్థులు ఎంత కష్టమైనా సరే గెలవాలని కసి పట్టుదల వారిని ఇంకో స్థాయిలో నిలబెడుతుంది అని పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ సుధీర్ కుమార్ లు వ్యాయామ ఉపాధ్యాయులు కిరణ్, అనిల్, అరుణ్ లను కూడా అభినందనలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333