అంగన్వాడి కేంద్రంలో అట్ల బతుకమ్మ పండుగ సంబరాలు

Sep 26, 2025 - 18:23
 0  15
అంగన్వాడి కేంద్రంలో అట్ల బతుకమ్మ పండుగ సంబరాలు

మరిపెడ 25 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పరిధిలోని వీరారం గ్రామ పంచాయతీలో మరిపెడ ఐసీడీఎస్ ప్రాజెక్టు యల్లంపేట సెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్వాడీ కేంద్రంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తంగేడు, గునుగు, చేమంతితో పాటు తీరొక్క పూలను సేకరించి బతుకమ్మలను అందంగా పేర్చి అంగన్వాడీ కేంద్రం ఆవరణలో పెట్టి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పాటలు పాడి కోలాటం వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంగన్వాడీ సూపర్వైజర్.ఉష.మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో ప్రతిరోజు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా గురువారం వీరారం అంగన్వాడీ కేంద్రంలో బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించినట్లు సూపర్వైజర్ ఉష తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ . కవిత. అహల్య. శ్రీవాణి. అచ్చమ్మ. పద్మ. హిర. బి కవిత.లక్ష్మి. అయ్యా నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333