హైడ్రా విధివిధానాలపై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం.
ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2వేల చదరపు కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా ఉండాలన్న సీఎం. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలి. జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్ లో వచ్చేలా జాగ్రత్త వహించాలి. నాళాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయండి.. హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలి. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలి. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించండి.. అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించండి.