రోడ్డుపై బైఠాయించిన రైతులు

May 5, 2026 - 11:24
 0  294
రోడ్డుపై బైఠాయించిన రైతులు

తిరుమలగిరి 05 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ 

రైతుల ఆందోళన... 

 కాంటాలు పెట్టాలంటూ ధర్నా... 

భారీగా నిలిచిన వాహనాలు.. 

ఇబ్బంది పడ్డ వాహనాదారులు... 

పట్టించుకోని పై అధికారులు... 

ఆరుగాలం పండించి వడ్లు కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోయారు వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతరం గ్రామంలోని వడ్లు కొనుగోలు కేంద్రాలలో కాంటాలు పెట్టాలని తోరూర్ వలిగొండ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ధాన్యాన్ని తీసుకువచ్చి నెల రోజులు గడిచిన కాంటాలు పెట్టడం లేదని ఇటీవల కురిసిన అకాల వర్షం వలన ధాన్య రాశులు తడిసి ముద్దయింది మొలకలు వస్తున్నాయని వాపోయారు వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ధర్నా విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి కొనుగోలు పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ధర్నా కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు వాహనదారులు ఇబ్బంది పడ్డారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి