సూర్యాపేటలో బంగారం కోసం దారుణ హత్య

Apr 18, 2026 - 20:16
Apr 18, 2026 - 20:24
 0  684
సూర్యాపేటలో బంగారం కోసం దారుణ హత్య

సూర్యాపేటలో వృద్ధురాలి దారుణ హత్య, బంగారం దోపిడీ

సూర్యాపేట,18 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 28వ వార్డు జై జై నగర్ శబరి మిల్క్ సెంటర్ వెనుక వైపు  వృద్ధురాలి ఇరుగు పాపమ్మ ను దారుణ హత్య కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఆమెను హతమార్చి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న ఎస్సైలు ఐలయ్య, ఏడుకొండలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333