నీట్' చుట్టూ ఖాకీ పహారా.. నిషేధాజ్ఞలు
రేపు జరగనున్న 'నీట్' పరీక్షల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 11 కేంద్రాల వద్ద సీపీ సన్‌ప్రీత్ సింగ్ సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (పాత 144 సెక్షన్) విధించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనుండగా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు జిరాక్స్ దుకాణాలు పూర్తిగా మూసివేయాలి. పరిసరాల్లో ముగ్గురికంటే ఎక్కువ మంది గుమికూడినా, ఆంక్షలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.