ఉపాధి హామీ కూలీలతో.. వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారపు రమేష్

May 2, 2026 - 12:31
May 2, 2026 - 12:36
 0  4

గుండాల 02 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని 148వ మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఉపాది హామీ కార్మికులతో కేక్ కట్ చేసి కార్మిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 1886 నాటి చికాగో పోరాటంగా మాత్రమే భావిస్తారు కానీ భారతదేశంలో కార్మికులు అనుభవిస్తున్న ఎన్నో హక్కులు చట్టాలకు మూలపురుషుడు డాక్టర్" బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మిక చట్టాల రూపశిల్పి కార్మిక హక్కుల యోధుడిగా ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా మనం తప్పక గుర్తుంచుకోవాలని వికాలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారం రమేష్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు నేరటి పురుషోత్తం మాట్లాడుతూ..8 గంటల పని విధానాన్ని చట్టబద్ధం చేశారు. కార్మికులకు న్యాయబద్ధమైన కనీస వేతనం దక్కేలా చట్టాన్ని తీసుకోవచ్చారు కార్మికులకు వైద్యపరమైన సామాజిక భద్రత కల్పించారు. ఉపాది హామీ కూలీలకు పీస్ వాల్యూ ఫోటోలు రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు.దీనివలన కొంతమంది కన్నులు ఫోటోలు రాక కూలీలకు ఇబ్బంది కలుగుతుందని తెలియజేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇట్టి విషయాలను గుర్తించి ఈ విధానాన్ని రద్దు చేసి కూలికి వచ్చిన వారికి కూలి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్మ గళ్ళ చంద్రయ్య, కొడాలి మాధవి, గురుకు శ్వేత, పంజాల వినోద, రజిని, మమత, కావ్య, భాగ్య, ఉపేంద్ర, లక్ష్మి, యాదమ్మ గ్రామ ఉపాధి హామీ కూలీలు, మహిళాలు పాల్గొన్నారు.