అనంతరం మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం
తిరుమలగిరి 13 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
ఆదివారం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సర పరీక్షలలో తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ అనంతారం విద్యార్థులు 95% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించారు.వీరిలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఎంపీసీ విభాగంలో డి.భార్గవి 942/1000, ఎం. అక్షయ 935/1000. అదేవిధంగా బైపీసీ విభాగంలో కే. లక్ష్మి 928/1000, ఎ.సిరి 924/1000, సిఈసి విభాగంలో ఎం. స్పందన 811/1000.ఎం. మనీషా 794/1000. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో ఏ. శ్రుతి 434/470. బి.రామ్ చరణ్ 431/470.బైపిసి విభాగంలో ఎస్డి హాతీయ 399/440.సిహెచ్ ప్రవర్ష 388/440. సి ఈ సి విభాగంలో సిహెచ్ వైష్ణవి 443/500. కే నక్షత్ర 390/500. మార్కులతో మండల టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దకోలా సంజీవ్ కుమార్ మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇంత మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.