నీట్  పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు

May 2, 2026 - 20:46
 0  1
నీట్  పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు

పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది.

ఆదివారం జరిగబోయే నీట్-2026 ప్రవేశ సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సెక్షన్ 163 BNSS అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా పరిధిలోని మొత్తం 03 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని,పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఎస్పీ తెలిపారు.సింగరేణి ఉమెన్స్ కళాశాల (కొత్తగూడెం),రామచంద్ర డిగ్రీ కళాశాల (లక్ష్మిదేవిపల్లి),సోషల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాల (Opp.Collectorate) లలోని పరీక్షా కేంద్రాల్లో జరగబోయే ఈ పరీక్షకు జిల్లా నుండి 1048 అభ్యర్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు.

1. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.

2. సభలు, సమావేశాలు, ర్యాలీ లు,ధర్నాలు నిషేధం.

3. పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు తేది 03-05-26 ఉదయం 06:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు మూసివేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు

ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని ఈ సందర్బంగా హెచ్చరించారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333