ప్రభుత్వ భూమిలో యూనిట్ కార్యాలయం మార్పు
– ఎంవీఐ జిలాని షేక్ వెల్లడి
కోదాడ, 06 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని తమ్మరలో కొనసాగుతున్న యూనిట్ కార్యాలయాన్ని గుడిబండలోని ప్రభుత్వ భూమికి మార్చుతున్నట్లు మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI) జిలాని షేక్ తెలిపారు. ఈ మార్పు 06-05-2026 తేదీ నుండి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు తమ్మరలో ఉన్న కార్యాలయం ప్రజలకు రాకపోకలలో ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో, సులభంగా చేరుకునేలా మరియు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో గుడిబండలోని ప్రభుత్వ స్థలంలో కొత్తగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ మార్పుతో కోదాడ మరియు హుజూర్‌నగర్ నియోజకవర్గాల ప్రజలకు సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని జిలాని షేక్ తెలిపారు. అలాగే, ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయడం వల్ల దీర్ఘకాలికంగా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాలు గుడిబండలోని కొత్త కార్యాలయం నుంచే నిర్వహించబడతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఈ మార్పును వినియోగించుకొని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరియు గుడిబండ గ్రామం నుండి ప్రత్యేకంగా వచ్చినటువంటి ఎరగని నాగ శేషు సీఎం శీను హాజరై ఆ టి ఓ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరిచారు