ఘోర రోడ్డు ప్రమాదం యువకులు మృతి
తిరుమలగిరి 17 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
పెట్రోల్ కోసం వెళ్తుండగా ప్రమాదం ఇద్దరు యువకులు మృతి వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలోని చింతలకుంట తండా గ్రామానికి చెందిన నవీన్ (20) తన స్నేహితులతో కలిసి కారులో పెట్రోల్ కోసం సమీప ప్రాంతానికి బయలుదేరారు జిబి తండా వద్ద లారీని ఓవర్ టెక్ చేయడానికి ప్రయత్నించగా కారు టైర్లు గాలి తక్కువగా ఉండటం వల్ల అదుపుతప్పి పల్టీ కొట్టింది దీంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు మృతదేహాలను పోస్టుమార్టం తుంగతుర్తి ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు...