గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు

May 2, 2026 - 20:45
 0  1
గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్ ఆఫీసర్ సురేష్ కు శనివారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో వైద్యులు ప్రధమ చికిత్స అందిస్తుండగానే సురేష్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమృత హాస్పిటల్ లో ఉన్న హోంగార్డ్ ఆఫీసర్ సురేష్ భౌతిక కాయానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు నివాళులర్పించారు.ఎల్లప్పుడూ చురుకుగా విదులు నిర్వర్తించే సురేష్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం పట్ల ఎస్పీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులను పరామర్శించి,తదుపరి కార్యక్రమాలను దగ్గరుండి చూసుకోవాలని అధికారులకు సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333