విద్యార్థులకు పోలీసు వేసవి వినోద శిబిరం.

May 2, 2026 - 15:27
May 2, 2026 - 15:30
 0  1
విద్యార్థులకు పోలీసు వేసవి వినోద శిబిరం.
విద్యార్థులకు పోలీసు వేసవి వినోద శిబిరం.
విద్యార్థులకు పోలీసు వేసవి వినోద శిబిరం.
విద్యార్థులకు పోలీసు వేసవి వినోద శిబిరం.
విద్యార్థులకు పోలీసు వేసవి వినోద శిబిరం.
విద్యార్థులకు పోలీసు వేసవి వినోద శిబిరం.
విద్యార్థులకు పోలీసు వేసవి వినోద శిబిరం.
విద్యార్థులకు పోలీసు వేసవి వినోద శిబిరం.

కేరింతలు, ఆనందోత్సవాలతో జుంబా డాన్స్ చేసి, ఉల్లాసంగా క్రీడలను ఆడిన బాలలు.

పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన పోలీసు పిల్లలను అభినందించి, నగదు బహుమతి అందించిన ఎస్పి

పిల్లలకు కష్టాన్ని అలవాటు చేయాలి.

విజయాలను, అపజయాలను తీసుకుని తత్వం నేర్పించాలి.

బాలల మానసిక ఉల్లాసానికి క్రీడలు, వ్యాయామం, డాన్స్ దోహదపడతాయి.

బాలలు క్రమశిక్షణ, నిరంతర కృషితో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలి.

సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ.

సూర్యాపేట, 02 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– పిల్లలకు వేసవి సెలవులు ప్రారంభమైనాయి, విద్యార్థులకు, పోలీసు పిల్లలకు వేసవి వేడిమి నుంచి ఉల్లాసాన్ని కలిగించడానికి సూర్యాపేట జిల్లా పోలీసుల ప్రత్యేక చొరవతో విద్యార్థులకు వేసవి వినోద శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ వినోదవంతమైన శిబిరాన్ని జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా ఎస్పీ నర్సింహా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన యోగా, జుంబా డాన్స్, క్రీడలు మొదలగు ఉల్లాసభరితమైన కార్యక్రమాలలో విద్యార్థులు విల్లాసం, ఆనందోత్సవాలతో గడిపారు. బాలలతో కలిసి జిల్లా ఎస్పి, అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, అర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐ లు, పోలీసు సిబ్బంది జుంబ డాన్స్, యోగ చేసి క్రీడలు ఆడారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు మాట్లాడుతూ వేసవి వేల పిల్లలు రోడ్లపై, ఇతర కార్యక్రమాలలో ప్రమాదకరమైన స్థితిలో ఉండకూడదని విద్యార్థులకు, పోలీసు పిల్లల కోసం ప్రత్యేక చొరవతో ఈ వేసవి వినోద శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. యోగా చేయడం, డాన్స్, క్రీడలు, నాటికలు, పెయింటింగ్స్ లాంటివి పిల్లల మానసిక ఉల్లాసానికి, జ్ఞాపకశక్తి పెంపొందించడానికి, శారీరక దృఢత్వానికి ఉపయోగపడతాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారి అలవాట్లను గమనిస్తూ ఉండాలని తెలిపారు, కష్టపడే తత్వాన్ని అలవాటు చేయాలని, గెలుపు ఓటమిలను ఆస్వాదించే విధంగా ప్రేరేపించాలని సూచించారు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్స్ నుండి దూరంగా ఉంచాలని అన్నారు. పోలీసు కుటుంబాల సంక్షేమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని దీనిలో భాగంగానే జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీస్ సబ్సిడరీ సెంట్రల్ క్యాంటీన్ ఏర్పాటు చేశామని, అత్యాధునిక వ్యాయామశాలను ఏర్పాటు చేశామని, వాలీబాల్ క్రికెట్ మైదానాలను పరేడ్ మైదానాన్ని అభివృద్ధి చేశామని  తెలిపారు. పోలీస్ సిబ్బంది ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

పోలీసు వినోద శిబిరానికి హాజరైన విద్యార్థులు పిల్లలతో కలిసి ఎస్పీ స్వయంగా సరదాగా కాసేపు గడిపి క్రీడలు ఆడారు యోగా జుంబా డాన్స్ చేశారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో అకాలంగా మరణించిన పోలీసు సిబ్బందికి ఈ సందర్భంగా నివాళి ఘటించారు.

పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపి మంచి మార్కులు సాధించి పోలీస్ సిబ్బంది పులల్లను సన్మానించి నగదు ప్రోత్సాహకం అందించారు. ఆర్మూడ్ కానిస్టేబుల్ శ్రీనువాస్ కుమార్తె భవ్యశ్రీ, మోతే పీస్ హోంగార్డ్ సురేష్ రెడ్డి కుమార్తె హర్షిత పదవ తరగతిలో మంచి మార్కులు సాధించారని సన్మానించి అభినందించారు. పిల్లలకు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని ఎస్పి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, అర్ముడ్ విభాగం డి.ఎస్.పి నరసింహ చారి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, రాజశేఖర్, అర్ఐ లు ప్రవీణ్ కుమార్, జానయ్య, ఎస్సైలు సాయిరాం, శ్రీకాంత్, ఐలయ్య, మహేష్, సైదులు, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్ఎస్ఐ సురేష్, హోంగార్డ్స్ ఆర్ఎస్ఐ అశోక్, స్పెషల్ పార్టీ ఆర్ఎస్ఐ అశోక్, టెక్నికల్ టీం ఆర్ఎస్ఐ రాజశేఖర్, భరోసా సెంటర్ ఎస్సై మౌనిక, షీ టీం సిబ్బంది, ఆర్మూడ్ పోలీస్ సిబ్బంది, సూర్యాపేట పట్టణ రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333