ఇసుక లారీలు పట్టివేత
పట్టుబడిన లారీలు ఎన్ని ....?
ఎన్ని లారీలపై కేసు నమోదు చేశారు...?
మూడు లారీలు పట్టుబడినట్టు సమాచారం... !
రెండు లారీల పై కేసు నమోదు....!
తిరుమలగిరి 07 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- అక్రమ రవాణా నిర్మూలన కోసం జిల్లా ఎస్పీ ఆదేశానుఅనుసారం తిరుమలగిరి మండల పరిధిలో తొర్రూర్ - వలిగొండ జాతీయ రహదారి పైన వెలిశాల ఎక్స్ రోడ్ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలలో బాగంగా బుధవారం ఉదయం సమయంలో రెండు లారీలు ఇసుకను నింపుకొని రాజమండ్రి వైపు నుండి తొర్రూర్, తిరుమలగిరి మీదుగా హైదరాబాదుకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడి చేసి ఇసుక రవాణా సంబంధించిన ఎలాంటి కాగితాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లుు ఎస్సై వెంకట్ రెడ్డిి తెలిపారు.