మహిళల అభ్యున్నత కు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
జిల్లా మహిళా సమైక్య నూతన భవనాన్ని కి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ .
ఇందిరా మహిళ శక్తి ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతానికి కృషి సీఎం .
జోగులాంబ గద్వాల 23 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. జిల్లా కేంద్రంలోని దౌదర పల్లి సమీపంలో నూతన జిల్లా మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ హాజరయ్యారు. నూతనంగా జిల్లా మహిళా సమైక్య భవనం నిర్మాణానికి 5 కోట్లు రూపాయలు తో మంజూరు శంకుస్థాపనానికి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగినది.
మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే కి జిల్లా కలెక్టర్ కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు..
డి ఆర్ డి ఏ మాట్లాడుతూ గద్వాల జిల్లాలో జిల్లా, మండల మహిళా సమఖ్యలో మహిళ సభ్యులు సభ్యత్వం పొందడం జరిగింది ప్రభుత్వం మహిళల బలోపేతం కోసం కృషి చేయడం జరుగుతుంది. మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలని ఇందిర మహిళా శక్తి పథకాన్ని శ్రీనిధి నుండి, మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం చిన్న చిన్న వ్యాపారం సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రస్తుతం కుటుంబంలో పురుషులతో పాటు మహిళలు కూడా పనిచేస్తేనే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి భావించి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను అందించి మహిళలకు కుట్టు మిషన్లు, చేపల విక్రయం, క్యాంటీన్సు వంటి వ్యాపారాలను మహిళా సమైక్యం లో సభ్యులు ఉన్నవారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. విధంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా ఆహార ఉత్పత్తి సంబంధించిన వాటికి, గేదలు బర్రెలు, కోళ్ల ఫారం , చిన్న చిన్న కుటీరం పరిశ్రమలు పరిశ్రమలలో ఉపాధి కల్పించి వారు కూడా ఆర్థికం గలడానికి బ్యాంకులు ప్రభుత్వం సహకారం చేయడం జరుగుతుంది. మహిళలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకులకు చెల్లించడం జరుగుతుంది రాష్ట్రంలోని ఇలాంటి ఇబ్బంది పరిస్థితి లేకుండా మన జిల్లాలో మహిళలు క్రమబద్ధంగా ప్రతి నెలకు బ్యాంకుల రుణాలు కట్టడం జరుగుతుంది తెలిపారు.
మహిళా సమస్యలు సభ్యురాలుగా ఉండి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా వర్తిస్తుందని తెలిపారు.
అదేవిధంగా మహిళ సభ్యులుగా ఉండి అకస్మాత్తుగా మరణిస్తే రుణము లు బ్యాంకులో రెండు లక్షల రుణమాఫీ బీమా వరకు వర్తిస్తుందని. తెలిపారు.
అన్ని హంగులతో మీటింగ్ హాల్ ట్రైనింగ్ హాల్ తో నిర్మాణం జరుగుతుంది విరిని ప్రతి ఒక్క సభ్యురాలు సద్విని చేసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.....
ప్రస్తుతం సమాజంలో మహిళలు కూడా పురుషుడి పాటు అన్ని రంగాలలో రాణించాలి ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే ఆ కుటుంబంలో మహిళలు కూడా పని చేస్తే కుటీర పరిశ్రమలతో ఏర్పాటు చేసుకొని ఉంటే ఆ కుటుంబం కి ఎంతో అండగా ఉంటుందని తెలిపారు.
మహిళా సమాఖ్యలు సభ్యురాలు ఉన్నవారికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కుట్టుమిషన్లు క్యాంటీన్లు, వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇండస్ట్రీ వంటి సంస్థలను ఏర్పాటు చేస్తే సోలార్ , కాటేజీ, వంటి ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తే వాటి వల్ల ఎక్కువగా ఉపాధి కలుగుతుంది మహిళలకు కూడా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర మహిళా సమస్యలు ఆహార పదార్థాలను క్యాంటీన్సు, వంటి రకరకాల చిరుధాన్యాలు తయారు చేసుకుని మాత్రమే ఉన్నది వీటి వల్ల కొంత లాభమే ఉంటది ఎక్కువగా ఆర్థికంగా లాభం అవకాశం ఉండదు కాబట్టి. ఇండస్ట్రీ వంటి సమస్యలు వస్తే మహిళలు కూడా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో మహిళలు కూడా అన్ని రంగాలలో రాణించడం వల్ల వారు కూడా ఎదగడానికి అవకాశం ఉంటది అని తెలిపారు.
మహిళా సమాఖ్య నూతన భవనంలో అన్ని రకాల హంగులతో మహిళలకు అన్ని విధాలుగా ఉండే విధంగా నిర్మాణం చేయడం జరుగుతుంది త్వరగా కాంట్రాక్టర్ ఈ భవనాన్ని పూర్తిచేసి మహిళా సమాఖ్య వారికి అందించాలని సూచించారు.
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు .
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.....
రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఇందర మహిళ శక్తి పథకాన్ని మహిళలు ఆర్థికంగా ఎదగాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
మహిళలు ఇప్పటివరకు మహిళా సమైక్య సభ్యురాలు కొంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఇదేవిధంగా మహిళలు భవిష్యత్తులో వివిధ సంస్థలను ఏర్పాటు చేసుకొని మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలి వారికి ప్రభుత్వం నుండి ఇలాంటి సహకారం కావాలన్నా అందిస్తాము బ్యాంకర్ రుణాలను వచ్చే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వపరమైన కార్యక్రమం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు యూనిఫామ్ కొట్టడానికి మహిళా సమైక్యవారికి అవకాశం కల్పించడం జరిగింది. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క కార్యక్రమంలో మహిళల ద్వారా ప్రజల్లోకి తీసుకోవాలని జరుగుతుంది. ప్రభుత్వం నుండి ఇలాంటి అవకాశం ఉన్న ఈ మహిళా సమాఖ్య లో ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు.
నూతన భవనాన్ని త్వరగా పూర్తిచేసి మహిళా సమైక్యవారికి అందించాలని అధికారులకు సూచించారు.
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు .
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, స్థానిక సంస్థల కలెక్టర్ డి ఆర్ డి ఏ నర్సింగ్ రావు, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండారి , జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి చెన్నయ్య, రమేష్ నాయుడు, కౌన్సిలర్ దౌలు, శ్రీను నరహరి గౌడ్, షుకుర్ మాజీ ఎంపీపీ లు విజయ్, రాజారెడ్డి, జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు సంగీత, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, ఉరుకుందు , గోవిందు ధర్మ నాయుడు, తుమ్మల నర్సింహులు నాగేంద్ర యాదవ్, మధు, సీతారాముల, వీరేష్, మొహియుద్దీన్, కిరణ్, నాగార్జున, అధికారులు, నాయకులు కార్యకర్తలు , మహిళా సమైక్య సభ్యురాలు, తదితరులు పాల్గొన్నారు.