సైబర్ నేరాలపై జరభద్రం ఎస్ఐ సత్యనారాయణ గౌడ్

May 23, 2024 - 20:41
May 23, 2024 - 21:24
 0  294
సైబర్ నేరాలపై జరభద్రం ఎస్ఐ సత్యనారాయణ గౌడ్

తిరుమలగిరి 24 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి  మండలం  కొక్య నాయక్ తండ గ్రామం లో పోలీసు కళాభృందం అధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.మహిళల, విద్యార్థుల రక్షణ, చట్టాలు, విద్యా విధానాలు, సమస్యలను అధిగమించడం, సోషల్ మీడియా, ఇంటర్నెట్ సద్వినియోగం లాంటి అంశాలపై మరియు విద్యార్థులు ఒత్తిడి అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలి, లక్ష్యం కోసం కృషి చేయాలని నకిలీ విత్తనాలపై అవగాహన మరియు నాటుసార గురించి పోలీస్ కళాబృందం సభ్యులు పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

 ఈ సందర్భంగా ఎస్సై  సత్యనారాయణ గౌడ్, మాట్లాడుతూ జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్  అధ్వర్యంలో మహిళల రక్షణపై పటిష్టంగా పని చేస్తున్నామని,గ్రామాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా శాంతి భద్రతలకు ఆటంకం కలిగించకుండా పరిష్కారం చేసుకోవాలి చట్టాలను చేతుల్లోకి తీసుకోకుండా వాటిని గౌరవించి పోలీస్ వారికి తెలియపరచాలి. ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సోషల్ మీడియాలో ఎవరినైనా ఉద్దేశించి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టరాదు.సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా, ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు, యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అని తెలిపినారు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.

 సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. పోలీసు కళబృందం వారు సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో సామాజిక అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం నందు పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ హేమచంద్ర పిల్లే కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపి, క్రిష్ణ,చారి,గురులింగం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034