బుద్ధ పూర్ణిమ లేక వైశాఖ బుద్ధ పూర్ణిమ అంటే ఏమిటి ?

May 23, 2024 - 20:14
 0  4
బుద్ధ పూర్ణిమ లేక వైశాఖ బుద్ధ పూర్ణిమ అంటే ఏమిటి ?

ఈ దేశ మూల వాసులు లేదా నాగా జాతి  ప్రజలు అయిన SC,ST,OBC మరియు ఇతర మైనారిటీ ప్రజలు ఇప్పుడు వున్న దేశ కాలమాణ పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వ్యక్తి గౌతమ బుద్ధుడు.
        గౌతమ బుద్ధుడు గురుంచి గురుంచి తెలుసుకోవటం అనగానే అదేదో  బౌద్ధ మతం ( మనం నమ్మి పాటించే మతం కానిది ) గురుంచి తెలుసుకోవటం అని అనుకుంటాం. అది శుద్ధ తప్పు, "బుద్దుడు గురుంచి తెలుసుకోవటం అంటే అది ఆయన ఈ దేశ మూల వాసులను బ్రాహ్మణుల చెర నుండి ఎలా రక్షించాడు అని తెలుసుకోవటమే".

      1)   బుద్ధ పూర్ణిమ లేక వైశాఖ బుద్ధ పూర్ణిమ అంటే ఏమిటి ? 
     బుద్దుడు జన్మించిన రోజు లేదా బుద్ధుడి పుట్టిన రోజు నే బుద్ధ పూర్ణిమ లేక వైశాఖ బుద్ధ పూర్ణిమ అంటారు.

2) బుద్దుడు కంటే ముందు అంటే ఈ దేశ పరిస్థితులు ఎలా వుండేవి ?
          యురేషియా నుండి వలస వచ్చిన విదేశీ బ్రాహ్మణులు ఇక్కడి మూల వాసులను సామ, దాన,భేద, దండో పాయాలతో ఓడించి, చాతుర్వర్ణ వ్యవస్థ ను ఏర్పాటు చేశారు, అందులో మనుషులను బ్రాహ్మణులు , క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులుగా విభజించి శూద్రులను బానిసలుగా ప్రకటించారు, శూద్రులు అనగా బానిసలు అని అర్థం.
        అలా శూద్రులుగా  ప్రకటించి, శూద్రులకు చదువుకునే హక్కు, ఆత్మ రక్షణకు ఆయుధం పట్టుకునే హక్కు, డబ్బు సంపాదించుకునే హక్కు, అలాగే డబ్బు కూడా బెట్టుకునే హక్కు లేకుండా చేసి శాశ్వత బానిసలుగా మార్చారు.. దీనినే చాతుర్వర్ణ వ్యవస్థ అని అంటారు...ఈ విధంగా బుద్దుడు కంటే ముందు వేల సంవత్సరాలు శూద్రులకు కనీస హక్కులు లేకుండా బాధపడుతూ జీవించేవారు.

3) తరువాత బుద్దుడు ( గౌతమ సిద్ధార్థ ) ఏమి చేశాడు ?

ఈ  చాతుర్వర్ణ వ్యవస్థ కు కారణం ఏంటని ఎవరైనా శూద్రులు బ్రాహ్మణులను అడిగినప్పుడు, "????మీరు గత జన్మలో చేసిన కర్మలు (పాపాలు)  దీనికి కారణం అని, ఈ పాపకర్మ లు   పోవాలంటే ఈ జన్మలో మీరు బ్రాహ్మణులకు జీవితాంతం, ఎదురు చెప్పకుండా  సేవ చేయాలని అలా చేస్తే వచ్చే జన్మలో బ్రాహ్మణులుగా పుట్టవచ్చు అని చెప్పేవారు దీనినే కర్మ సిద్దాంతం అని అంటారు,???? ఇప్పటికీ బ్రాహ్మణులు మనకు ఇదే చెబుతారు మనవాళ్లు దీన్ని ఇప్పటికీ నమ్ముతారు అది వేరే విషయం అనుకోండి.????
    అయితే ఈ రకంగా చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా బానిసలుగా బ్రతుకు తున్న  దేశ ప్రజలను చూసి ఇదంతా నిజమేనా అని తనను తాను ప్రశ్నించుకుని, "నిజమేమిటో తెలుసుకోవాలని అనేకమంది గురువులను కలుసుకుని నిజం కనిపెట్టలని కుటుంబాన్ని త్యాగం చేసి , యువరాజు గా వున్న గౌతమ సిద్ధార్థుడు రాజ్యాన్ని వదిలేసి , "సత్యాన్ని కనిపెట్టటానికి వెళ్లి, 6 సంవత్సరాలు కఠోర శ్రమ చేసి కనుకున్నది ఏంటంటే బ్రాహ్మణులు తమ పొట్టకూటి కోసం, ఈ సమాజం మీద ఆధిపత్యం కోసం, ఈ దేశ మూల వాసులు, నాగా జాతి ప్రజలు అయిన SC,ST,OBC మరియు ఇతర మైనారిటీ ప్రజలను బానిసలుగా మార్చారు అని కనిపెట్టారు,దీన్నే గౌతమ సిద్ధర్థ కు కలిగిన జ్ఞానోదయం అని చెబుతాం," 

4) తరువాత బుద్దుడు ఏ మార్గం వైపు నడిచాడు ? దాని ద్వారా ఈ  సమాజం లో కలిగిన మార్పులు ఎంటి ?

ఆ తరువాత "ఈ  దేశ మూల వాసులకు  బ్రాహ్మణుల బానిసత్వం నుండి  స్వేచ్ఛ కల్పించటం కోసం మొట్టమొదటగా పాఠశాలను  ( స్కూల్ ) విహార పేరుతో ఏర్పాటు చేశాడు  ( దీన్నే మనం ఇప్పుడు బుద్ధ విహార పేరుతో పిలుస్తున్నాం) , ఇందులోకి అందరికీ ప్రవేశం కల్పించాడు, ముఖ్యంగా స్త్రీలకు కూడా , ఎందుకంటే  బ్రాహ్మణుల సిద్దాంతం ప్రకారం ప్రతీ స్త్రీ కూడా శూద్రురాలే అనగా బానిసనే, ఆ విధంగా చదువును, జ్ఞానాన్ని అందించాడు ,అందుకే అప్పటి నుండి ప్రజలు గౌతమ సిద్దార్థను బుద్ధ అని పిలవటం మొదలు పెట్టారు, బుద్ధ అంటే బుద్ధిని ఉపయోగించే వ్యక్తి అని అర్థం".

     ఈ రకంగా ఈ దేశ మూల వాసులు అయిన SC,ST,OBC మరియు ఇతర మైనారిటీ ప్రజలు బుద్దుడు చెప్పిన మార్గం లో నడిచి బౌద్ధులుగా మారిపోయారు, ఈ రకంగా వీరిని అందరినీ ఏకం చేశాడు బుద్దుడు, "వీరు ఏకం కావటం వలన ఈ దేశ మూల వాసులు / నాగా జాతి ప్రజలు/ బౌద్ధులు, మౌర్య సామ్రాజ్యం  ఏర్పాటు చేసి ఈ దేశ పాలకులు అయ్యారు, ఆ రకంగా బ్రాహ్మణులు బుద్దుడు చేసిన విప్లవం ద్వారా తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు,బ్రాహ్మణులు కూడా మిగిలిన  సాధారణ ప్రజలవలె బ్రతకవలసి వచ్చింది. అందులో ముఖ్య పాత్ర పోషించింది సామ్రాట్ అశోకు మౌర్య".
 
6) తరువాత బ్రాహ్మణులు ఎలాంటి ఎత్తుగడలు వేశారు ?

         అయితే  తగిన సమయం కోసం 140 సంవత్సరాలు ఎదురుచూసిన బ్రాహ్మణులు అదను చూసుకుని అశోకుని ముని మనువడు అయిన బృహద్రుద మౌర్యను చంపి తిరిగి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఏర్పాటు చేశారు, అలాగే ఈ ఆధిపత్యం నిలబడటం కోసం మనుస్మృతి నీ రాసి మరొక్కసారి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని శాశ్వతంగా  ప్రస్తాపితం చేశారు. అందుకే బ్రాహ్మణులు మనుస్మృతి నీ పవిత్ర గ్రంధం గా చెబుతారు.

      "అలాగే మూల వాసులు కనుక ఒక్కటిగా వుంటే భవిష్యత్తులో ఎప్పుడు అయిన తిరిగి అధికారం పొందుతారు అన్న ముందు ఆలోచనతో బ్రాహ్మణులు ఈ దేశ మూల వాసులను చిన్న చిన్న ముక్కలు గా అంటే చిన్న చిన్న కులాలుగా విభజించారు, అది కూడా ఒకరి మీద ఒకరికి శత్రుత్వం భావనతో, ఆధిపత్య భావనతో, అసహ్య భావంతో. అందులో భాగంగానే"  "ఎవరైతే బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఒప్పుకోలేదో వారిని అంటరాని వారుగా ప్రకటించటం జరిగింది, కుల వ్యవస్థ ను భరించలేక కొద్దిమంది అడవుల్లోకి పారిపోయి ఆదివాసులుగా , గిరిజనులు గా మారిపోగా , బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఒప్పుకున్న వారిని సామాజికంగా కొంత ఉన్నత స్థాయిలో వుంచి, అగ్ర కులంగా ప్రకటించి బ్రాహ్మణుల చెప్పు చేతల్లో పెట్టుకున్నారు, అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీరికి స్వేచ్ఛను కానీ, బ్రాహ్మణుల తో సమాన స్థాయిని కానీ ఇవ్వలేదు, కానీ అగ్రకులము అన్న ఒక భ్రమలో వుంచి బ్రాహ్మణుల సిద్దాంతం అమలు అయ్యేలా చూసుకుంటున్నారు", ఇదే పద్ధతి ఈ నాటికీ కూడా కొనసాగుతుంది.

7) కుల వ్యవస్థ కు వ్యతిరేక లేదా బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం?
 అయితే ఎంతో మంది అగ్రకుల ప్రజలు, నిమ్న కుల ప్రజలు ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించారు, అలాంటివారి చరిత్ర ను మనకు తెలియకుండా బ్రాహ్మణులు చాలా జాగ్రత్త పడ్డారు, ఊదాహరణకు మన ఆంధ్ర దేశం లో వేమన రెడ్డి, వీర బ్రహ్మేంద్ర సామి, త్రిపురనేని రామస్వామి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ , ఇతర రాష్ట్రాల్లో  పెరియార్ రామసామి, నారాయణ గురు,పండిత అయోతిదాసు ఇంకా మహాత్మ జ్యోతిరావు ఫూలే,సావిత్రి భాయి ఫూలే, చత్రపతి సాహు మహారాజు , బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా ఇలా చాలా మంది...
      అయితే దేశం లోకి మొఘల్ పాలన వచ్చిన తర్వాత మనుషులు అందరూ సమానం అని చెప్పిన ఇస్లాం లోకి చాలా మంది అంటరానివారు మతం మార్చుకున్నారు, అలాగే సిక్కు మతం లోకి కూడా అంటరాని వారు మారారు,  అలాగే బ్రిటీష్ వారు వచ్చాక మనుష్యులు అందరూ సమానం అని చెప్పిన క్రైస్తవం లోకి చాలా మంది అంటరానివారు మత మార్పిడి చేసుకున్నారు.. ఇదంతా స్వచ్ఛందంగా జరిగిపోయింది.

    ఈ రకంగా మత మార్పిడి జరుగుతున్న క్రమం లో బ్రాహ్మణులు కూడా ఇస్లాం లోకి, సిక్కు మతం లోకి , క్రైస్తవం లోకి మారి చివరికి భారతదేశం లో వున్న ఇస్లాం, సిక్కు  , క్రైస్తవ మతాల్లోకి కూడా కుల వ్యవస్థ ను తీసుకుని వచ్చారు... అందుకే కుల నిర్మూలనకు అంటరాని వారితో పాటు ముస్లీంలు, సిక్కులు, క్రైస్తవులు కూడా కలసి పని చేయవలసి వుంటుంది అని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు..

7) బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కి బుద్ధుడికి సంబంధం ఏమిటి ?

      అయితే మళ్ళీ బుద్దుడు దగ్గరికి వస్తె , ఏ విధంగా అయితే బుద్దుడు ఈ దేశ మూల వాసులు ను ఏకం చేసి ఈ దేశానికి పాలకులను చేశాడో, అదే విధంగా బుద్దున్ని ఆదర్శంగా తీసుకున్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, 6743 కులాలుగా విడిపోయిన ఈ దేశ మూల వాసులను, రాజ్యాంగ బద్దంగా SC,ST,OBC లు అనే ఒక మూడు పెద్ద వ్యవస్థగా తయారు చేసి ఈ దేశానికి పాలకులుగా చేయాలని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చాలా కష్టపడి రాజ్యాంగ బద్ధంగా విద్యను, ఉద్యోగాలను,  ఓటు హక్కును, రిజర్వేషన్ ను, ఇచ్చి మనల్ని ఈ దేశానికి పాలకులుగా మార్చే పోరాటాన్ని చేశారు అయితే ఆయన మరణం తో ఆ ప్రయత్నం ఆగిపోయింది, కానీ దీన్ని ముందుగానే వూహించిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఈ దేశ మూల వాసులకు తోడుగా , అండగా వుంచారు.. కానీ మన చదువుకున్న వారు దీన్ని అర్థం చేసుకోక ఇప్పటికే చాలా అవకాశాలు పోగొట్టుకున్నారు, బాబా సాహెబ్ అంబేద్కర్ కానీ, మహాత్మ జ్యోతిరావు ఫూలే కానీ చదువుకున్న  మేధావి వర్గం మాత్రమే ఈ సమాజాన్ని ముందు వుండి నడుపుతారు అని, తమ భవిష్యత్తు తరాలను కాపడుకుంటారు అని నమ్మి మనకు విద్యను ఇవ్వటం జరిగింది కానీ అలా జరగలేదు, అందుకే ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది, ఇలా జరిపించడం కోసం   బ్రాహ్మణులు కలసికట్టుగా పని చేస్తున్నారు, ఒక సిద్దాంతం ప్రకారం, ఒక సంస్థ ను ఆధారంగా దేశ వ్యాప్తంగా కలసి పని చేస్తూ రాజ్యాంగాన్ని, మూల వాసుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.. "దీనికోసం ఒకప్పుడు మనుస్మృతి ఆయుధంగా వాడితే , అదే బ్రాహ్మణులు ఇప్పుడు EVM (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్) లను దీనికోసం ఆయుధంగా వాడుతున్నారు"

ఒకవేళ బ్రాహ్మణులు కనుక ఇందులో విజయం సాధిస్తే ముఖ్యంగా అందరికంటే ముందు విషమ పరిస్థితినీ, గడ్డు కాలాన్ని ఎదుర్కోవలసి వచ్చేది ఇప్పుడు చదువుకుని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ, ఆర్థికంగా కాస్తో కూస్తో బాగున్నాము అని అనుకునేవారు, ఎందుకంటే మిగిలిన వారు ఎలాగో బానిసలుగా వున్నారు కాబట్టి వారి జీవితం లో పెద్ద తేడా వుండదు, కాబట్టి ఇప్పుడు ఈ దేశ మూల వాసులు తమ భవిష్యత్తును కాపాడు కోవాలి అంటే ఆనాడు బుద్దుడు చేసిన పోరాటాన్ని, మహాత్మ జ్యోతిరావు ఫూలే పోరాటాన్ని, బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పోరాటాన్ని  అర్థం చేసుకోవాలి, దేశ వ్యాప్తంగా ఏకం అవ్వాలి, ఒక సిద్దాంతం  ఆధారంగా , ఒక సంస్థ ఆధారంగా ఒక సంఘటిత శక్తిగా తయారు అవ్వాలి, "ముఖ్యంగా ఇప్పుడు EVM ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లకు  వ్యతిరేకంగా పోరాటం చేయాలి" అందరూ ఒకే లక్ష్యం తో ఒకే  మార్గం లో నడవాలి, అందుకోసం చరిత్ర తెలుసుకోవాలి..

          ఇదే ఈ బుద్ధ పూర్ణిమ యొక్క సందేశం...

బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు ????????

  జై భీమ్, నమో బుద్దయ

              ఇట్లు 
         BAMCEF 
 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333