సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం
సూర్యాపేట జిల్లా లో సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్, అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లు పరిశీలించిన మల్టి జోన్-2 ఐజిపి శ్రీ సత్యనారాయణ IPS గారు.
అక్రమ రవాణా పై కఠిన చర్యలు.
బార్డర్ చెక్ పోస్ట్ లలో నిరంతర నిఘా ఉంది.
గంజాయి రవాణా వినియోగం, జూదం లేకుండా చేయాలి.
అక్రమార్కులతో చేతులు కలిపితే పోలీసులపై శాఖాపరమైన చర్యలు తప్పవు.
గంజాయి సరఫరా మరియు వినియోగం, ఇసుక అక్రమ రవాణా, PDS రైస్ అక్రమ రవాణా, జూదం ఇవి సామాజిక రుగ్మతలు.
శ్రీ.సత్యనారాయణ IPS, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మల్టిజోన్-2.
జిల్లాకు విచ్చేసిన IG గారికి జిల్లా ఇంచార్జీ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు పుష్పగుచ్చం ఇచ్చి, గౌరవ వందనం స్వాగతం తెలిపినారు.
జిల్లా పోలీసు కార్యాలయం నందు సూర్యాపేట జిల్లా ఇంఛార్జి SP శరత్ చంద్ర పవార్ IPS గారితో, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశం నందు మాట్లాడిన మల్టి జోన్-2 ఐజీపీ శ్రీ సత్యనారాయణ IPS గారు.
సూర్యాపేట పట్టణ PS ను ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డ్స్ నిర్వహణను, విధులు తీరును పరిశీలించి కేసుల దర్యాప్తు, ఫిర్యాదుల పరిశీలనలో సిబ్బందికి సలహాలు సూచనలు చేశామని IGP గారు అన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రా, తెలంగాణ చెక్ పోస్ట్ లను పరిశీలించి బలోపేతం చేయడం జరుగుతుంది అని, పూర్తి స్థాయిలో అంతరాష్ట్ర సరిహద్దు వెంట అక్రమ రవాణాను నిరోధించడానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ పటిష్టంగా పని చేస్తున్నారు అన్నారు.
సరిహద్దుల వెంట ధాన్యం అక్రమ రవాణా జరగవద్దు, గంజాయి రాష్ట్రం లోకి రావొద్దు, ఎక్కడ జూదం నిర్వహించవద్దు, ఇసుక అక్రమ రవాణా జరగవద్దు, PDS బియ్యంతో అక్రమ వ్యాపారం జరగవద్దు అని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అన్నారు. దీనికోసం పోలీసులు పటిష్టంగా పని చేస్తారు అన్నారు.
మల్టీజోన్-2 పరిధిలో 22 ప్రాంతాలలో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశాము, నారాయణపేట, జోగులాంబ గద్వాల, కర్ణాటక, రాయచూరు బార్డర్లు చెక్పోస్ట్ లు నిర్వహిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉన్న తెలంగాణా గేట్ వే గా ఉన్న నల్గొండ జిల్లా సూర్యపేట జిల్లాలలో కూడా అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 7 పరీష్టమైన సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది వీటి ద్వారా అనుక్షణం తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఏఓబి నుండి వస్తున్న గాంజాపై స్పెషల్ నిఘా ఉన్నది, రహదారుల వెంట, గ్రామాల్లో మాఖా భంది కార్యక్రమాలు, వాహనాల తనిఖీలు, ఆకస్మిక రైడ్స్ చేస్తున్నాము. ఇతర ప్రాంతాల నుండి తెలంగాణ గేట్వే ద్వారా వస్తున్న గంజాయిని ప్రతిష్టంగా నిర్మూలిస్తున్నము, అక్రమ రవాణా పై సూర్యాపేట, నల్గొండ జిల్లాల ఎస్పీలు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో తీసుకున్న చర్యల వల్ల చాలావరకు గంజాయి సరఫరా వినియోగం తగ్గింది అన్నారు. సూర్యాపేట నల్గొండ జిల్లాలలో మిర్యాలగూడ, ఇతర ప్రాంతాల్లో రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి, పిడిఎస్ రైస్ అక్రమ వ్యాపారం జరుగుతున్న సమాచారం ఉన్నది , ఇతర ప్రాంతాలకు పిడిఎఫ్ రైస్ అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. నదులు, వాగుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తోవడం వల్ల పర్యావరణంకి భంగం కలుగుతుంది అని ఇలాంటి అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నాము అన్నారు. పిడిఎస్ రైస్, గాంజాయి, ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిపై, పేకాట, మట్కా లాంటి జూదం నిర్వహించే వారిపై పక్కా నిఘా ఉంచి వాటిని అనిచి చేయాలి పోలీసు అధికారులను IG గారు ఆదేశించారు.
అక్రమ వ్యాపారాలకు ఎవరైనా పోలీసులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తే అలాంటి వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై నిగా ఉంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అణచివేయాలని ఆదేశించారు.
పోలీసు లకు ప్రజలు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ లో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఎస్పీ గారు వెంట జిల్లా ఇంఛార్జి ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రవి, DCRB DSP మట్టయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, RI లు, CI లు ఉన్నారు.