గానుగుబండ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం
తుంగతుర్తి మార్చి01: తెలంగాణవార్త ప్రతినిధి:- తుంగతుర్తి మండల కేంద్రం గానుగుబండ గ్రామంలో గురువారం నాడు ఉదయం 9 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే గానుగుబండ గ్రామవాసి గూడెల్లి వీరమల్లు తన ఇంట్లో ఫ్యాన్ వైరు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లో ఉన్న బీరువా, మంచం, ఎల్ఈడి టీవీ, ఇల్లు, పూర్తిగా కాలిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వీరమల్లు ఆవేదనతో ఇంట్లో ఎవరూ లేకపోవడం తమ అదృష్టం బాగుండి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. మేము 30 40 ఏళ్లు పూరి గుడిసెలోనే బ్రతికాము గవర్నమెంట్ ఇల్లు ఇస్తారేమో అని పది సంవత్సరాలు ఎదురు చూశాను గవర్నమెంట్ ఇల్లు రాకపోవడంతో ఒక సంవత్సరం క్రితమే అప్పుచేసి సిమెంటు ఇటుకలతో రెండు రూములు రేకులు వేసుకొని నేను నా భార్య ఆ అప్పు తీర్పడం కొరకు హైదరాబాదుకు బ్రతుకపోయాం మాకు ఉన్న ఒక్క ఆధారం ఆ ఇల్లు అది పూర్తిగా ధ్వంసం అయింది. ప్రతిరోజు మా భార్య నేను కూలికి వెళ్తాము. మాకు ఎక్కడ కూడా సెంటు భూమి కూడా లేదు 'వెంటనే అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.