పౌష్టికాహారం పంపిణీ
జోగులాంబ గద్వాల 2 మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల. సర్పంచ్ సావిత్రమ్మ హాజరై చాగాపురం అంగన్వాడి కేంద్రం రెండు నందు గర్భిణీ బాలింతలకు మరియు 7 నెలల పిల్లల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు అంగన్వాడి కేంద్రంలో బరువులు ఎత్తులు గుర్తించి టి హెచ్ ఆర్ బాలామృతం గుడ్లు పంపిణీ చేశారు. ఏ ఎల్ ఎం ఎస్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సావిత్రమ్మ మాట్లాడుతూ మూడు సంవత్సరముల నుండి పిల్లలను అంగన్వాడి సెంటర్ కు క్రమం తప్పకుండా తమ పిల్లలను పంపించాలని తల్లిదండ్రులను కోరారు. గర్భిణీ బాలింతలకు ఆకుకూరలు పాలు గుడ్లు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని గర్భిణి స్త్రీలకు ఆమె సూచించారు. అంగన్వాడి సెంటర్లలో ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించి మంచి అభివృద్ధి పదము లో అంగన్వాడి సెంటర్ లు నడిచేలా చూస్తానని గర్భిణీ బాలింతలకు మరియు పిల్లల తల్లిదండ్రులకు ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి సర్పంచ్ బి సావిత్రమ్మ & భర్త పరుష రాముడు .ఆశ గర్భిణీలు బాలింతలు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.