శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ సందర్శించిన సీసీఆర్ సభ్యులు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సెక్రటరీ చారకొండ బాబు
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం సింగోటం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో రంగా రావు, జూనియర్ అసిస్టెంట్ జైపాల్ రెడ్డిని సింగోటం టెంపుల్ దగ్గర కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సెక్రెటరీ చారకొండ బాబు, వనపర్తి జిల్లా సిసిఆర్ మెంబర్ కురుమన్న దేవాలయ అధికారులను కలవడం జరిగింది. అనంతరం స్వీటు ఫలహారాల దుకాణాలను పరిశీలించడం జరిగింది. అక్కడ పరిసరాల పరిశుభ్రతపైన, స్వీటు ఫలహారాలు విక్రయించే తుకాలను, తక్కెడ, బాట్లను, తయారు చేసే స్థలాల్లో శుభ్రత గురించి, వారికి అవగాహన కల్పించడం జరిగింది. మరియు తూకాలలో తేడాలు ఎలా ఎలా చేస్తున్నారు అనే విషయాన్ని గమనించి ప్రజలకు వివరించి దుకాణం యజమానులకు కూడా వివరించడం జరిగింది. తక్కువ తూకాలతో వ్యాపారం చేస్తూ, భక్తులను మోసం చేస్తున్న స్వీటు దుకాణ యజమానులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇలాంటి మోసాలు మళ్ళీ పునరావృతం అయితే సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేస్తామని వారికి అవగాహన కల్పించడం జరిగింది. హోటలలో అపరిశుభ్రత, వంట పాత్రలు, త్రాగునీరు, పరిసరాల శుభ్రత అవగాహన కల్పించడం జరిగింది. భక్తులకు ప్రజలకు ఎలాంటి నాణ్యత లేకుండా భోజనాలు టిఫిన్లు ఏర్పాటు చేసిన, ఎలాంటి హారమైన కలుషితం చేసిన సంబంధిత అధికారులకు కంప్లీట్ చేస్తామని వారికి అవగాహన కల్పించడం. తలనీలలు( కేశఖండన ) భక్తుల దగ్గర అధిక డబ్బులు వసూలు చేయకూడదు అని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే తలనీలలో సమర్పించే భక్తులకు అవకాశం కల్పించాలని దేవాలయ అధికారులకు మరియు భక్తులకు అవగాహన కల్పించడం జరుగుతుంది.