సూక్ష్మంలో మోక్షం హోమియోపతి వైద్యం* .........

ఏప్రిల్ 10 తేదీ ను హోమియోపతి వైద్య ప్రదాత *డాక్టర్ శామ్యూల్ హానిమన్* జయంతి ని ప్రపంచ వ్యాప్తంగా *హోమియోపతి దినోత్సవం* గా జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని...... *సూక్ష్మంలో మోక్షం హోమియోపతి వైద్యం* ..........డా:పరికి పండ్ల అశోక్,హోమియో పతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (HMAI) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. --------------------------------
రోగి.... రోగం..... ఔషధం.....అన్న మూడు అంశాలకు హోమియోపతిలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. స్వస్థత ,అస్వస్థత ,వ్యాధి ..... ఈ అంశాలను "రోగ" పరంగా కాక "రోగి" పరంగా విశ్లేషించాలి అన్నది హోమియో వైద్య మౌలిక సూత్రం.
సూక్ష్మమైన హోమియో పతి గుళిక తో అనితరసాధ్యమైన క్యాన్సర్ లాంటి వ్యాధులనుండి సైతం మోక్షం కల్పించే అవకాశం కలదు. దాదాపు రెండున్నర శతాబ్దాల క్రితం జర్మనీలో పుట్టిన డాక్టర్. *శామ్యూల్ హానిమన్* కృషి ఫలితంగా పురుడు పోసుకుని, ప్రపంచవ్యాప్త ఆదరణ పొందిన ఈ వైద్యవిధాన బలం ఏమిటని ఒక సామాన్య రోగిని అడిగితే "అసలు నా బాధ ఏమిటో, నా గోడు ఏమిటో" హోమియో పతి డాక్టర్ ఆలకిస్తాడు అని టక్కున సమాధానం ఇస్తాడు. మనిషిని కేవలం ఒక రోగి లా, యంత్రం లా చూస్తూ నిమిషాల లో చీటీ రాశి ఇచ్చేయడం కాకుండా ....మనిషిని..అతని తత్వాన్ని.... మరియు అతని శరీరంలో తలెత్తిన సంక్షోభాన్ని .....సానుకూలంగా అర్థం చేసుకుని, దానిని బట్టి చికిత్స చేయడం ఇందులోని మౌలిక అంశం. హోమియోపతిలో ప్రతి వ్యక్తి కూడా భిన్నమైన వ్యక్తే. వ్యాధి తో పాటు అతని వ్యక్తిత్వం కూడా ముఖ్యమే. ఉదాహరణకు అందరికీ సమస్య ఉబ్బసం లేదా ఆయాసం (ఆస్తమా) కావచ్చు, కానీ దాని వెనుక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటిని గుర్తించి, వ్యక్తిని అర్థం చేసుకొని దాని ఆధారంగా వ్యాధిని సమూలంగా నయం చేయడం ఈ విధానంలోని ప్రత్యేకత. తన సమస్యను తానే నయం చేసుకునే లా శరీరాన్ని ప్రేరేపిస్తుంది హోమియోపతి వైద్యం. ఆ నయం చేసుకునే శక్తి.... అనేది మన అందరి లోనూ ఉంది. ఇతర వైద్య విధానాలు వ్యాధి లక్షణాలను పోగొట్టడానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తాయి. మళ్లీ మనిషి తిరిగి సమ స్థితిలో కి తీసుకు రావడం, మన శారీరక శక్తిని ప్రేరేపించడం ....వీటి గురించి పట్టించుకోకుండా వ్యాధి లక్షణాలను పోగొట్టేందుకు, వాటికి వ్యతిరేక మందులు ఇవ్వడం లేదా శరీరం తయారు చేసుకోలే క పోతున్న... హార్మోన్ల వంటి వాటిని బయటి నుండి ఇవ్వడం చేస్తాయి , కానీ హోమియో వైద్యంలో ఇటువంటి పరిస్థితులలో *ఏం చేయాలో శరీరానికి* దారి చూపించే పని చేస్తు,వ్యాధిని నయం చేసే పని చేస్తుంది.
*ప్రకృతి సిద్ధాంతం:*
మనిషిలో ప్రాణం, మనస్సు మరియు దేహం అనే మూడు అంశాలున్నాయి.శరీరంలో కణాలు, ధాతువులు, అవయవాలు, మనస్సు తదితర వ్యవస్థలో అన్ని0టి కార్యక్రమాలను అనుసంధానం చేసే ది ప్రాణశక్తి .ఇది వక్రిస్తే దేహ కార్యక్రమాలు కుం టు పడితేనే ....మనం వ్యాధి అంటున్నాం. వ్యాధి దశలను పరిశీలిస్తే మొదట ప్రాణశక్తి లో, తరువాత మానసిక స్థాయిలో.... ఆ తర్వాత దేహంలో మార్పులు జరుగుతాయి. హోమియో వైద్యంలో ఔషధ ఎంపికలో ప్రాణ, మానసిక స్థాయిలో మార్పు లను పరిగణనలోకి తీసుకుంటారు. మనిషి అంటే కేవలం బొచ్చు తీసిన కోతి కాదు. మానసిక స్థాయిలో ఎంతో పరిణామం చెందిన జీవి. అందుకే మనసులోని రెండు భాగాలైన బాహ్య మనస్సు మరియు అంతర మనస్సు పాత్ర...... శరీర కణాల ఆరోగ్య స్థాయిని శాసిస్తాయి. మనసు శరీరాల మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని బట్టి చూపించే అంశం చాలా ముఖ్యమైనది.దీనిని దృష్టిలో ఉంచుకొనే ఔషధ ధర్మాల నిర్ధారణ కోసం మానవులపై మాత్రమే ప్రయోగాలు జరపాలని డాక్టర్ హానిమన్ నొక్కి చెప్పారు.
*సూక్ష్మమైన ఔషధం* :
ప్రతి మనిషికి ప్రాణ శక్తి ఉంటుందని..... వ్యాధి వచ్చినపుడు అది కృంగుతుందనీ ...... ఉత్తేజ పరిస్తే వ్యాధి తగ్గుతుందని, ప్రాణశక్తి భౌతికమైనది కానందున...... దానిని సరి చేసే మందు కూడా శక్తి స్వరూపం లో అంటే అతి సూక్ష్మంగా ఉండాలని ప్రతిపాదించి, ఆ రకంగానే మందుల్ని తయారుచేసి వ్యాధి నివారణ లు కలిగించి అద్భుత ఫలితాలు చూపించారు హోమియో ప్రధాత డాక్టర్ హానిమన్. వైద్యం సున్నితంగా, శీఘ్రంగా, శాశ్వతంగా జరగాలన్నది హోమియో వైద్య ధ్యేయం.ఔషధాల వల్ల అవాంఛనీయ దుష్ఫలితాలు తలెత్తకుండా ఉండేందుకు వాటిని ప్రత్యేక పద్ధతిలో పల్చన (potentization) చేసి వాడటం మొదలు పెట్టారు. ఔషధాలను నమ్మశక్యం కానీ దశ వరకు పల్చన చేయగలిగారు. ఆ ప్రక్రియ ద్వారా రస... విష.... పాషా నాలను సైతం అమృత తుల్యమైన ఔషధాలుగా మార్చి, దుష్ప్రభావాల బాధ... బెడద.... లేకుండా ఔషధాన్ని సూక్ష్మాతి, సూక్ష్మమైన మోతాదులో వాడటం కీలకమైన అంశం. ప్రతి పదార్థానికి భౌతిక మరియు రసాయనిక ధర్మాలే కాక, వైద్య ధర్మాలు కూడా ఉంటాయని దాని ఆధారంగానే ఎందుకు పనికిరాని దిగా భావించే ఇసుక నుండి తయారు చేసిన "సైలీషియా" హోమియోపతి లో సర్జన్ గా పనిచేస్తుంది. మనం నిత్యం వాడుకునే ఉప్పు నుండి తయారుచేసిన "నేట్రమ్మూర్" క్యాన్సర్ కు సైతం మందుగా పనిచేస్తుంది.
*శాశ్వత మోక్షం*:
ఒక ఔషధం ఆరోగ్యవంతుని లో ఏ వ్యాధి లక్షణాలను సృష్టిస్తుందో..... ఆ లక్షణాలు గల రోగికి అదే ఔషధాన్ని సూక్ష్మరూపంలో ఇచ్చినట్లయితే స్వస్థత చేకూరుతుంది. దీని ఆధారంగానే " likes cure likes " అన్న దాన్ని ప్రకృతి సిద్ధ నియమంగా నిర్ధారించారు. చికిత్స నియమాల "laws of cure " ఆవిష్కారానికి కొత్త ద్వారాలు తెరిచింది, అంతేకాకుండా ఔషధ ధర్మాల నిర్ధారణకు ఆ మందులను ముందుగా మానవులపై మాత్రమే ప్రయోగించి చూడటం అన్న విధానానికి పునాది వేసింది హోమియో వైద్యం. నే డు ఇతర వైద్య విధానంలో కూడా ఔషధాలను మానవులపై ప్రయోగించిన అనంతరమే మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. గ్రీకు భాషలో హోమియోపతి అనగా "అదే విధమైన బాధ" అని అర్థం. శరీరమునకు ఏ విధమైన బాధ ఉన్నదో, అదే విధమైన బాధను శరీరంలోనికి మందుల ద్వారా చొప్పించడం వల్ల అసలు బాధను నిర్మూలించడం, ఇది మన పురాణాలలో ఉన్న "ఉష్ణం ఉష్ణేన శీతలం" ను పోలి ఉంది . ఈ చిత్రమైన విశిష్టమైన పద్ధతిని ప్రజలు వెంటనే నమ్మలేదు. సమకాలికులైన గొప్ప గొప్ప డాక్టర్లు, ప్రభుత్వాల నుండి విమర్శలను ఎదుర్కొని చివరకు నిజం నిలకడ మీద తెలిసొచ్చి ప్రజలు విశ్వసించి, ప్రభుత్వం గుర్తించి, ప్రజలు ఆదరిస్తున్నారు.
*చరిత్ర .....వర్తమానం.........భవిష్యత్తు ఆశాకిరణం*
యూరప్ లో "క్రూప్" వ్యాధి ప్రబలినప్పుడు జర్మనీలో ప్రమాదకరమైన "స్కార్లెట్ ఫీవర్" వచ్చినప్పుడు , రష్యాలో కలరా వ్యాధి సోకినప్పుడు లక్షలాది మందిని రక్షించిన చరిత్ర హోమియోపతికి ఉంది . అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇప్పటివరకు చూసినట్లయితే పసిపిల్లల పాలిట మహమ్మారి అయినా మెదడు వాపు వ్యాధి విషయంలో ఈ వైద్యం పనితనాన్ని పసి హృదయాలు దివ్యంగా కేరింతలు కొట్టి ఆరోగ్యాన్ని పెంపొందించడములో చిన్న హోమియో గుళిక అసాధారణ ప్రతిభ మన అందరికీ తెలుసు. మొన్నటికి మొన్న ప్రతి పౌరుని గడగడలాడించిన చికెన్ గున్యా మరియు నిన్నటికి నిన్న స్వైన్ఫ్లూ విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమై, తర్జనభర్జనల తర్వాత ఉన్న వాస్తవాలు బయటపడి నిజాలను నమ్మక తప్పలేదు. ప్రస్తుత విషయానికి వస్తే కరోనా మహమ్మారి పై జరిగిన వివిధ పరిశోధనల ఫలితంగా హోమియోపతి ఔషధాల పనితీరును మనం ఒప్పుకోక తప్పదు. భవిష్యత్తులో కూడా ఎటువంటి ఉపద్రవాలు ముందుకు వచ్చినప్పుడు కూడా హోమియో వైద్య సూక్ష్మమైన గుళిక మాత్రమే మానవాళిని రక్షిస్తుందన్నది అతియోశక్తి కాదు. ఇటువంటి సుదీర్ఘ చరిత్ర నుండి ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా ,జర్మనీ, రష్యా మొదలుకొని సుమారు 158 దేశాలలో హోమియో వైద్యం అధికారికంగా ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రులు నిరంతర సేవలు అందిస్తూ ఉండడానికి కారణభూతుడైన గొప్ప మహాత్ముడు డాక్టర్ శామ్యూల్ హానిమన్. వీరు క్రీస్తుశకం 1755 ఏప్రిల్ పదవ తారీఖున జర్మనీ దేశం లోని " మీసేస్"అనే గ్రామంలో జన్మించి "ఏర్ లాజెంన్" విశ్వవిద్యాలయములో ఇంగ్లీషు వైద్యంలో ఎం.డి. పట్టాను పొంది,20 సంవత్సరాలు దిగ్విజయంగా అల్లోపతి వైద్యమును ప్రజలకు అందించినప్పటికీ,తనకు ఆ విధానంలో రోగులను హింసించడం, తాత్కాలిక ఉపశమనం ఇవ్వడం ఇష్టంలేక, ఆత్మ శాంతి లభించక వైద్యం మానేసి, వివిధ భాషలలో పుస్తకాలను తర్జుమా చేస్తూ.... మానవజాతికి వైద్య విషయంలో ఏదో ఒక దారి చూపాలని తపిస్తూ 20 సంవత్సరాలు పరిశోధించి.... మనకు ఈ వైద్యాన్ని అందించిన ఘనుడు ఆయన. భారతదేశం విషయానికి వస్తే సుమారు 180 వైద్య కళాశాలలు,40 పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కళాశాలలు మరియు సుమారు 3 లక్షల మంది శిక్షణ పొందిన వైద్యులు సేవలందిస్తున్నారు. హోమియోపతి వైద్య ప్రదాత డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారి జయంతి అయిన ఏప్రిల్ 10 వ తారీకున ప్రపంచవ్యాప్తంగా *హోమియోపతి దినం* గా జరుపుకుంటున్నారు. ఇటువంటి సుదీర్ఘ చరిత్ర గల ,ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకున్న హోమియోపతి వైద్యాన్ని ప్రజలందరూ వినియోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ.......