సుస్మిత కు మా సహాయ సహకారాలు అందిస్తాం..
MBBS సీటు సాధించిన సుస్మిత ను సన్మానించిన యువ నాయకులు కె.ఉరుకుందు,టీచర్ రామ్ రెడ్డి
అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థిని సుస్మిత ను వెంకటాపురంలోని శ్రీ శ్రీ శ్రీ అలిపిర స్వాముల వారి బుక్ సెంటర్ దగ్గర 2024 నీట్ లో ప్రతిభ కనబరిచి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సుస్మిత ను శాలువా తో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు...
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
సుస్మిత కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేయూతని ఇవ్వడం చాలా సంతోషం అని కె. ఉరుకుందు,రామ్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు... సుస్మితకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు....
వారితో పాటు,రాముడు,గోవర్ధన్ దాస్, పరుష రాముడు,తాపీ మేస్త్రి కృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.....