సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో జయప్రదం చేయండి

Oct 22, 2024 - 19:51
 0  7
సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో జయప్రదం చేయండి

ఏటూరు నాగారం అక్టోబర్ 22 తెలంగాణ వార్త:- మండల కేంద్రంలో ఈ రోజున సిపిఎం పార్టీ 6వ మండల మహాసభ ఎండీ యాకుబ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల వెంకట్ రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ సిపిఎం పార్టీ రెండవ జిల్లా మహాసభ  ఆదివాసి ఉద్యమాల కేంద్రమైన ఏటూరునాగారం లో నవంబర్ 29, 30 నిర్వహించడం జరుగుతుంది.  ఈ మహాసభలు జయప్రదం చెయ్యాలి అని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశంలో బిజెపి అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిరంతరం పోరాటాలు నిర్వహించింది. రైతు వ్యతిరేక చట్టాల కు వ్యతిరేకంగా సంస్కరణల ను వేగవంతం చేస్తూ పబ్లిక్ రంగా ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగాఅమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరంతరం సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నది. అంతేకాకుండా జిల్లాలో ప్రధానంగా పోడు సాగుదారులకు పట్టాలి ఇవ్వాలని ములుగు జిల్లా రైతు లకు గోదావరి నుండి సాగునీరు అందించాలని జిల్లాలో  ఫారెస్ట్ రెవెన్యూ మధ్య న ఉన్న వివాదాస్పద భూమి 40,000 ఎకరాలకు పైగా జిల్లాలో ఉన్నది ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నాం. పార్టీ జిల్లా మహాసభలో చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలు నిర్ణయించుకుని ఈ మహాసభ తర్వాత పోరాటాలు రూపు దిద్దుకోని ప్రజలను సన్నద్ధం చేయడం కోసం ఈ మహాసభ వేదిక కానుంది. కావున ప్రజలు. ప్రజాతంత్ర వాదులు. వ్యాపారస్తులు ఈ మహాసభలు జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి. కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బిరెడ్డి సాంబశివ, జిల్లా కమిటీ సభ్యులు ఎండి దావూడ్,DYFI జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అరుణ్, వసంత నాగయ్య, యాకుబ్, చిటమట రమేష్, బండారి నరసింహులు. బోట కృష్ణ. బైరబోయిన విష్ణు. ఎట్టి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333