చితికిన వృద్ధ వీఆర్ఏల బతుకులు
పెబ్బేర్ తాసిల్దార్ కు వినతి పత్రం బతుకులు రోడ్డున పడ్డాయి నిజం ప్రభుత్వం నుండి నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వరకు గ్రామాల్లో నీరటి,సుంకరి, మస్కరి,గ్రామ సేవకుడు, వీఆర్ఏ వంటి పేర్లతో పిలువబడుతూ గ్రామాలలో రెవిన్యూ శాఖ కింది స్థాయి సిబ్బందిగా గ్రామంలో ఉంటూ రైతుల నుండి భూమిశిస్తూ వసూలు చేస్తూ శాంతి భద్రతలను కాపాడుతున్నారు. గురువారం ఉదయం60 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమక్షంలో పెబ్బేరు రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు, బతుకులు రోడ్డున పడ్డాయి ప్రభుత్వం రూల్స్ ప్రకారం 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేయకపోతే రిటైర్మెంట్ అయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర ఆర్థిక ప్రయోజనాలు రావు.55 సంవత్సరాల వయసు పైబడి అరకు లోపు ఉన్న పూర్వ వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలకు తీసుకువచ్చి వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగం అవకాశం కల్పించినట్టే,61 సంవత్సరాల పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగ అవకాశం ఇచ్చి విధంగా అవకాశం ఇవ్వాలి.లేదా ప్రస్తుతం ఉన్న శాఖలోని వారి వారసుడికి అవకాశం కల్పించాలి.అన్నం దొరికే సమయానికి మా బతుకులు రోడ్డున పడ్డాయి.జీవో 81 సవరణ చేసి లేదా కొత్త జీవో ద్వారా అయినా మా వా రసులకు ఆ స్థానంలో ఉద్యోగం కల్పించాలి కొత్తగా కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం మా కుటుంబాలకు న్యాయం చేయాలి గత ప్రభుత్వం వృద్ధ వీఆర్ఏలకు అన్యాయం చేసి ఇచ్చిన మాట తప్పినా, కొత్త ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకంతో ఉన్నాం.
ఈ కార్యక్రమంలో,లక్ష్మీ దేవమ్మ,ఓంకార్,మన్యం, రాజు,సహదేవుడు,ధర్మయ్య, కురుమయ్య,రమేష్,చంద్రి తదితరులు పాల్గొన్నారు.