జూనియర్ లైన్ మెన్ కు ఇక దిక్కు ఎవరు..? లబోదిబో మంటున్న బాధిత కుటుంబం..?

Sep 26, 2024 - 11:41
Sep 26, 2024 - 18:48
 0  131
జూనియర్ లైన్ మెన్ కు ఇక దిక్కు ఎవరు..? లబోదిబో మంటున్న బాధిత కుటుంబం..?

నాడు జూనియర్ లైన్మెన్ ను వేధించారని ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన.. సిఎండికి జిల్లా అధికారులకు ఫిర్యాదులు.. ఈనెల 20వ తారీఖున ముదిగొండ మండలం కమలాపురం సబ్ స్టేషన్ పరిధిలో జూనియర్ లైన్మెన్ లింగం పున్నయ్య విద్యుత్ స్తంభం పై నుండి కింద పడి నడుములకు తీవ్రంగా గాయాలు కావటం మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ యశోద హాస్పిటల్కు తరలించారు. కానీ శాఖపరమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపిన అధికారులు.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా నేపాన్ని వేరే వారిపై నెట్టే ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబు..? అంటూ కన్నీటి పర్యంతం అవుతున్న బాధితులు బాధిత కుటుంబం నాటి హామీలను మర్చిపోయారా..? ఆరోపణలు ఉన్నా కాపాడుతున్నారా.. అంటూ ప్రశ్నిస్తున్న జనాలు...

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State