సీజనల్ వ్యాధులపై అవగాహన
తిరుమలగిరి 31 జులై 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- ప్రస్తుత సీజన్ లో గ్రామీణ ప్రాంత ప్రజలలో మరియు విద్యార్థులలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత వుంటూ పరిశుభ్రత పాటించాలని జిల్లా పరిషత్ పాఠశాల తాటిపాముల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాశెట్టి శ్రీనివాసులు అన్నారు. స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బంది ఏఎన్ఎం సంధ్యారాణి , ఆశ వర్కర్ ఐలా సునీత ఆధ్వర్యంలో తాటిపాముల ఉన్నత పాఠశాలలో సీజనల్ వ్యాధుల నివారణ పై అవగాహన కల్పించారు. సంధ్యారాణి మాట్లాడుతూ ఈగలు, దోమలు ప్రబలకుండా పరిశుభ్రమైన వాతావరణం ఉంచుకోవాలని , నిల్వవుండే నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని కోరారు. సమావేశంలో ఉపాద్యాయులు.ప్రభాకర్ ,.సీత, డాక్టర్.లింగయ్య,.సంతోష్ కుమార్,.బాలకిషన్,.వెంకన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.