సిపిఐ మండల కార్యదర్శిగా ఎండి ఫయాజ్ నియామకం

తిరుమలగిరి, 31 జులై 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- 28వ తారీకు జరిగిన సిపిఐ విస్తృత సమావేశంలో ఎండి ఫయాజ్ ను మండల కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల కార్యదర్శి ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ కు, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లకు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లముల యాదగిరి , కంబాల శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపాడు. సిపిఐ పార్టీ నాపై నమ్మకంతో మండల కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నా శక్తివంచన లేకుండా పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఆయన అన్నారు.