గద్వాల పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికులకు సన్మానం బట్టల పంపిణీ.....

Jan 15, 2025 - 20:00
 0  3
గద్వాల పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికులకు సన్మానం బట్టల పంపిణీ.....

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని 9వ వార్డ్ కౌన్సిలర్ సంబారి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ  తాను కౌన్సిలర్ గా గెల్పొందినప్పటి నుండి గద్వాల పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికులకు, ప్రతి సంవత్సరం సంక్రాంతి కనుమ పండుగ రోజున 9 వ వార్డుకు సంబంధించిన జవాన్ పరమేష్ తో సహా పారిశుద్ధ కార్మికులకు మహిళలకు, పురుషులకు అందరికీ గౌరవంగా సన్మానించి బట్టలను పంపిణీ చేశారు. గద్వాల మున్సిపల్ చైర్మన్ బి.ఎస్. కేశవ్ సహకారంతో  మా  9వ వార్డ్ అన్ని విధాలుగా డ్రైనేజీ ,బీటీ రోడ్డు, వీధిలైట్లు,  మంచినీటి  సరఫరా అన్ని వసతులతో వారు ప్రజలకు ఇబ్బందులకు లోన్ కాకుండా అన్ని సౌకర్యంతో 9వ వార్డుకు సహకరించారని అలాగే పారిశుద్ధ కార్మికులు  మా  వార్డుకు ఎప్పటికప్పుడు చెత్తా,చెదారం సేకరించి ప్రజలు దోమలకు లోను కాకుండా శుభ్రపరచి  వార్డ్ ప్రజలకు  సేవలందించారని వార్డ్  కౌన్సిలర్  సంబారి శ్రీమన్నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333