సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
తిరుమలగిరి 14 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
కుల సంఘాల కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయంతో
బీసీ ఫెడరేషన్ కులాల సమితి హర్షం
తెలంగాణలోని బీసీ ఫెడరేషన్ కులాల సమితి వినతితో రాష్ట్ర ప్రభుత్వం పలు కుల సంఘాల కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో బిసి ఫెడరేషన్ కులాల సమితి జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి తోపాటు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర కోశాధికారి పసుపులేటి కరుణాకర్ మాట్లాడుతూ నాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఫెడరేషన్ కులాలను మరియు వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ను పాలకమండలలు, నిధులను ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత శాసనసభ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ ను కలిసి ఫెడరేషన్ కులాల సమస్యలను కార్పొరేషన్ లో ఏర్పాటు ఆవశ్యతను వివరించడంతో నేడు స్పందించిన సీఎం, మంత్రివర్గం పలుకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం నశించేదగ్గ విషయం అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు కొత్తపల్లి ఉపేందర్, కౌన్సిలర్ బత్తుల శ్రీనివాస్, నాయకులు సుంకర జనార్ధన్, ఎంపీటీసీ జుమ్మిలాల్, పేరాల వీరేష్, నరసింహ, డానియల్ తదితర నాయకులు పాల్గొన్నారు.