ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం ఇమ్మడి సోమ నరసయ్య

Mar 13, 2024 - 19:53
 0  93
ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం ఇమ్మడి సోమ నరసయ్య

తిరుమలగిరి 14 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడమే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయుటకు నిర్ణయించడం హర్షణీయం. ఈ సందర్భంగా ఆర్యవైశ్య అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య మాట్లాడుతూ ఆర్యవైశ్యుల చిరకాల కోరిక నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహచర మంత్రులకు కార్పొరేషన్ కొరకు కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి లకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సూర్యాపేట జిల్లా తరఫున ధన్యవాదాలు తెలిపారు 

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034