సిపిఎస్ వద్దు ఓ పి ఎస్ కావాలంటున్న ఉద్యోగులు
జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల . పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకునే చాగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు భోజనం విరామం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ పెన్షన్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి హక్కు అని వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. పెండింగ్ లో ఉన్న ఆరు డీఏలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.