నెట్టెంపాడు సాగు నీటిని విడుదల చేయాలి
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి ; ఇటిక్యాల. మండలంలో ప్రవహించే నెట్టెంపాడు ప్రాజెక్టు ఆయకట్టు పొలాలకు సాగునీటిని విడుదల చేయాలి.అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ నరసింహ రావును కలిసి ఆయన సమస్యలను వివరించారు. షాబాద్,ఉదండాపురం, శనిగపల్లి, పెద్దదిన్నె,చాగాపురం,బుడ్డారెడ్డిపల్లి,తదితర గ్రామాలకు సాగునీరు అందడం లేదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.