పాత కక్షలతో వ్యక్తిని చంపినా కేసులో 17 మంది నిందితులకు జీవితఖైదు శిక్ష

ఎస్సీ,ఎస్టీల మీద నేరాలకు పాల్పడే వారి మీద కఠిన చర్యలు సీపీ సుధీర్ బాబు ఐపీఎస్
అడ్డగూడూరు 18 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని అజీంపేట గ్రామంలో పాత కక్షలతో ఒక వ్యక్తిని చంపిన సంఘటన Cr.NO 76/2017 కేసులో 17 మంది నిందితులకు నల్గొండలోని ఎస్సీ ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు మంగళవారం రోజు జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది.కొందరు ఆవేశపరుల కుల అహంకారం, పాత కక్షలు, తాత్కాలిక ఉద్రేకం అన్నీ కలిసి ఒక వ్యక్తి మరణానికి కారణమైన సంఘటన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అజీంపేట గ్రామంలో 2017 సంవత్సరంలో జరిగింది. ఈ కేసులో వివరాలను పరిశీలిస్తే ఈ సంఘటనలో మృతుడు బట్ట లింగయ్య గతంలో అదే గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యి బెయిలు మీద బయటకు రావడం జరిగింది. ఆ పగను మనసులో ఉంచుకున్న అతని కుటుంబ సభ్యులు మరియు తోటి కులస్తులు దసరా పండుగ సందర్భంగా జరిగే ఉత్సవాల్లో మృతుడు బట్ట లింగయ్య కుటుంబంతో సహా పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో గతంలో తన వల్ల చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఎదురుకాగా వారు క్షణికావేశంతో ఉద్రేకానికి లోనై, దుర్భాషలాడుతూ విచక్షణ రహితంగా, సామూహికంగా భౌతిక దాడికి పాల్పడడం మూలంగా తీవ్ర గాయాల పాలై మృతి చెందడం జరిగింది.
ఈ ఉద్రిక్త ఘటన గురించిన సమాచారం అందిన తక్షణమే రంగంలోకి దిగిన అడ్డగూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు U/S,147, 302, 323 504 R/W 149 &109 IPC & సెక్షన్ 3(1)(r)(s),3(2)(va) ఎస్సీ ఎస్టీ చట్టం, మరియు అడ్డగూడూరు స్టేషన్ SC No 45/2018 ప్రకారం కేసు నమోదు చేసిన అనంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కేసు విచారణ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఎస్.రమేష్ అప్పుడు ఎసిపి హోదాలో ఈ కేసు విచారణను నిష్పక్షపాతంగా వేగవంతంగా నిర్వర్తించి, పక్కా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి అఖిల గారు వాదనలు వినిపించారు. సాక్ష్యాదారాల పరిశీలన అనంతరం నల్గొండలోని ఎస్సీ ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు ఈ కేసులో 17 మంది నిందితులు ఒక్కొక్కరికి జీవిత ఖైదు శిక్ష మరియు రూ.6000/- జరిమానా విధించింది.ఈ కేసులో శిక్ష విధించబడ్డ నిందితులు: A1)పండుగ రామస్వామి s/o రాజముల్లు వయస్సు:21, వృత్తి: విద్యార్థి, కులం: యాదవ్, A2)పండుగ సాయిలు S/o రామస్వామి, వయస్సు: 40 సం,, కులం: యాదవ్, వృత్తి: వ్యవసాయం రాములు, 5 సం,: పాండుగ రాములు, 5 సం, కులం: యాదవ్ A4)పండుగ మల్లేష్ s/o చిన్న రాములు వయస్సు: 25 సం, కులం: యాదవ్ వృత్తి: విద్యార్థి, A5)బండగొర్ల వలరాజు S/o రామచంద్ర, వయస్సు:35 సం,, కులం:యాదవ్, వృత్తి: వ్యవసాయం, A6) పండుగ యాదయ్య s/o వీరమల్లు, వయస్సు: 42 సం, వృత్తి: వ్యవసాయం, కులం: యాదవ్, A7)జక్కుల రమేష్/ఓ బిక్షం, వయస్సు:25 సం,, కులం:యాదవ్, వృత్తి:విద్యార్థి A9) 0 విద్యార్థి, A11) పండుగ నర్సాయిష్ s/o రామస్వామి, వయస్సు: 50 సం, కులం: యాదవ్, వృత్తి: వ్యవసాయం, A12) పండుగ సత్యనారాయణ s/o పిత్చియా, వయస్సు: 30 సం, కులం: యాదవ్ వృత్తి: వ్యవసాయం, A13) బండగొర్ల నాగమ్మ w/o వల్రాజు, వయస్సు: 30 ఏళ్ల కులం : యాదవ్ వృత్తి: వ్యవసాయం, A14) పండుగ శ్రీను / ఓపెద్ద పిచ్చయ్య, వయస్సు: 30 సం, కులం: యాదవ్, వృత్తి: వ్యవసాయం, A15) పనగ మల్లయ్య s/o పెద్ద పిచ్చయ్య వయస్సు: 40 సం,, కులం: యాదవ్, వృత్తి: వ్యవసాయం, A16) పండుగ లింగయ్య s/o పెద్ద పిచ్చయ్య, వయస్సు: 35 సం,, కులం: యాదవ్, వృత్తి: వ్యవసాయం, A17) జక్కుల లచ్చయ్య, s/o బక్కయ్య, వయస్సు: 38 సం,, కులం: యాదవ్, వృత్తి: వ్యవసాయం A18) పోలబోయిన లింగయ్య s/o ఐలయ్య, వయస్సు: 40 సం,, కులం:యాదవ్, వృత్తి:సర్పంచ్ R/o: అజీంపేట(V) గ్రామం, అడ్డగూడూరు (m). A8) జక్కుల.బిక్షమయ్య s/o బక్కయ్య, వయస్సు: 45 సం, ఈ కేసు విచారణలో ఉండగా మరణించడం జరిగింది.
తాత్కాలిక ఆవేశంలో విచక్షణను మరిచి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేవారు తగిన శిక్షను అనుభవించాల్సి వస్తుందని, తమ చక్కటి భవిష్యత్తును కోల్పోయి జైలు జీవితం గడపాల్సి వస్తుందని కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యక్తులు తాత్కాలిక ఆవేశాలకు లోనుకాకూడదని, కులతత్వాన్ని విడనాడాలని, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని సూచించారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పూర్తిస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి రాచకొండ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని, నేరస్తులకు చట్ట ప్రకారం శిక్షలు విధించేలా చేస్తున్నామని, బాధితులకు తగిన న్యాయం అందించడానికి నిష్పాక్షిక మరియు వేగవంత విచారణ విధానాలను అనుసరిస్తున్నామని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుకు మరియు మహిళల పట్ల జరిగే నేరాల అదుపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.