సిపిఎం సీనియర్ నాయకులు
-మాటూరు రాంచంద్ర రావు మృతి
-పలువురు నివాళులు -నేడు అంత్యక్రియలు
ఖమ్మం :సిపిఎం సీనియర్ నాయకులు మాటూరు రాం చంద్రరావు (76)బుధవారం ఖమ్మం శ్రీనివాసనగర్ లోని స్వగృహం లో మరణించారు. విషయు తెలుసుకొని పలువురు మృతదే హం సందర్శించి నివాళులు అర్పించారు. అమరులు ఖమ్మం మాజీ ఎమ్మెల్యే , సిపిఎం సీనియర్ నెత మంచి కంటి రాం కిషన్ రావు కు స్వయానా మేనల్లుడు అయిన రాంచంద్రరావు ఆయన స్ఫూర్తి తో కమ్యూనిస్ట్ ఉద్యమం లోకి వచ్చారు. మధిర మండలం మాటూరు పేట లో పుట్టిన ఆయన ఆనాడే పార్టీ పిలుపు మేరకు ఖమ్మం వచ్చి స్థిర పడ్డారు.1964లో సిపిఎం సానుభూతి పరుడు గా ఉన్న ఆయన 1965 పార్టీ సభ్యులు అయ్యరు. అప్పటి కె ఆయన తండ్రి నాగ భూషణ రావు ఖమ్మం జిల్లా పార్టీ కార్యలయ కార్యదర్శి గా ఉన్నరు. స్టూడెంట్ ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ )వ్యవస్థాపక నాయకులు, అంటుతరువాత ఎస్ ఎఫ్ ఐ గా రూపాంతరం లోను వ్యవస్థాపక నాయకులు గా ఉంటూ 1973లో సిపిఎం పూర్తి కాలం కార్యకర్త అయ్యారు.అనేక ఉద్యమాల కు నెత్రుత్వం వహించారు.1976 ఏమర్జెన్సీ కాలం లో అంతకు ముందు, తరువాత, జైలు జీవితం గడిపారు. ఏమర్జెన్సీ కాలం లో పార్టీ ఆదేశాలు మేరకు కేంద్రం, రాష్ట్ర నాయకత్వము కు కొరియర్ గా పని చేసారు. రహస్య జీవి తము గడి పారు. తన నివాసం ఉద్యమ కేంద్రం గా మార్చారు. సనాతన సాంప్రదాయ కుటుంబం లో పుట్టిన, తుది శ్వాశ వరకు సిపి ఎం విధానంకోన సాగించారు. ఖమ్మం జిల్లా సి ఐ టి యు ప్రధాన కార్యదర్శి గా పనిచేసి ఎన్నో ఉద్యమాలకు నెత్రుత్వ ము వహించారు. సిటు విస్తరణ, నిర్మాణం లో కిలకం వహించారు. ఎంతో మంది ని నాయకులు గా తయారు చేసారు.