మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో పలువురి చేరిక
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి సమక్షంలో బిజెపి యువ నాయకులు 46వ వార్డు మాజీ కౌన్సిలర్ కట్కూరి కార్తీక్ రెడ్డి, 17వ వార్డు కాంగ్రెస్ నాయకులు మల్లయ్య జ్యోత్స్న, 27వ వార్డు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ, లు వీరితో పాటు సుమారు వందమంది ఆయా పార్టీలకు రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రెండెళ్ల పాలనలో చేసింది శూన్యమని అన్నారు. అభివృద్ధి అంటే 10 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ నాయకత్వంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. అభివృద్ధిని కాంక్షించి బిఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమం లో బిఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ ఇస్లాంవత్ రాంచంద్రనాయక్, రాష్ట్ర కార్యదర్శి వై వి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గోప గాని వెంకట నారాయణ గౌడ్, జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, మారిపెద్ధి శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పిటిసి జీడి భిక్షం, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, కీసర వేణుగోపాల్ రెడ్డి, సిరివెళ్ల శబరి, తదితరులు పాల్గొన్నారు.