వికలాంగులకు మౌలిక వసతులు కల్పించాలి
జిల్లా అధ్యక్షులు సురపంగ ప్రకాష్
భువనగిరి 21 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు మాటూరి బాలరాజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.జండా ఆవిష్కరణ అనంతరం జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్ అధ్యక్షతన నిర్మించిన సదస్సులో సంఘం గౌరవ అధ్యక్షులు మాటూరి బాలరాజు మాట్లాడుతూ NPRD 2010 ఫిబ్రవరి 21న ఆవిర్భవించిన గత 14 సంవత్సరాలుగా దేశంలో రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్వహించే వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తుంది.
అందం చేస్తున్న కృషి అభినందనీయమని వారు కొనియాడడం జరిగింది.జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పెన్షన్ 6000 లకు పెంచాలని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని వికలాంగుల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. వీటి అమలు కోసం అవసరమైతే వికలాంగులంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని వారు పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ NPRD ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు 21 నుండి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయని ఈ సందర్భంగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాలని వారు జిల్లాలోని వికలాంగులకు పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొల్లేపల్లి స్వామి, కన్వీనర్ కొత్త లలిత, జిల్లా ఉపాధ్యక్షులు పాక వెంకటేష్, మురళి నాయక్ జిల్లా నాయకులు జోకు స్వామి కొండాపురం మనోహర ఉపేందర్ రెడ్డి, రంగా సంతోష్, గ్యార సరిత తదితరులు పాల్గొన్నారు.