రాజ్యాంగన్ని పరిరక్షించేందుకు లౌకిక వాదులు ఐక్యం కావాలి!

Apr 18, 2024 - 18:55
 0  10
రాజ్యాంగన్ని పరిరక్షించేందుకు లౌకిక వాదులు ఐక్యం కావాలి!
రాజ్యాంగన్ని పరిరక్షించేందుకు లౌకిక వాదులు ఐక్యం కావాలి!

వికలాంగుల హక్కులను కలరస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి?

పెంచిన వికలాంగుల పెన్షన్ 6వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి!

 ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ 
రామన్నపేట 18 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రామన్నపేట మండల పరిధిలోని కక్కిరేణి గ్రామంలో పిట్ట శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా  ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా సాగించిన పాలనతో లౌకికవాద, ప్రజాస్వామ్యo ప్రమాదంలో పడిందని అన్నారు.ప్రభుత్వ యంత్రాంగాన్ని, పార్లమెంట్‌లో తనకున్న మెజారిటీని దుర్వినియోగం చేస్తూ, నిరంకుశవాద, మతోన్మాద మోడీ ప్రభుత్వం దేశంలోని కార్మికుల హక్కులను నాశనం చేసేందుకు ఫాసిస్ట్‌ పద్దతులను ఉపయోగిస్తోందని అన్నారు .  భారత రిపబ్లిక్‌ లౌకిక, ప్రజాస్వామ్య స్వభావాన్ని పూర్తిగా ఆవేశంతో కూడిన, అసహనం, విద్వేషం, హింసల ప్రాతిపదిక కలిగిన నిరంకుశవాద, ఫాసిస్ట్‌, హిందూత్వ దేశంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్చించారు.  బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించడమే ప్రతి దేశభక్తుని బాధ్యత అని అన్నారు.  ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను  తిప్పికొట్టాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు 6వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇస్తామని 100 రోజులులోపు వికలామానికి పెన్షన్ అందజేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ పింఛన్ ఇవ్వడం లేదు వెంటనే ఇవ్వాలి పని హక్కును రాజ్యాంగ హక్కుగా చేర్చాలని, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పట్టన ఉపాధికి హామీ కల్పిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించాలని నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్య ప్రయివేటీకరణను ఆపాలని వాణిజ్యకీకరణ, మతతత్వకరణ, కేంద్రీకరణ విధానాలను తిప్పికొట్టలని అన్నారు  ప్రయివేటు రంగంలో రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న వికలాంగుల చట్టాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. దేశ వ్యాప్తంగా పెరిగిన ధరలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్స్ ఎందుకు పెంచడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్తులను ఎందుకు భర్తీ చేయడం లేదని అన్నారు.వికలాంగులపై వేధింపులు అరికట్టెందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా కమిటీ సభ్యులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి కక్కిరేణి గ్రామ అధ్యక్షురాలు కన్నబోయిన మంగమ్మ ,గ్రామ ప్రధాన కార్యదర్శి చిల్లా రమాదేవి, కోశాధికారి కన్నబోయిన రాములు ఉపాధ్యక్షులు కన్నబోయిన బిక్షపతి సహాయక కార్యదర్శి కన్నబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333