ప్రశ్నించే గొంతుకలు (కడెం.ధనంజయ )

ప్రశ్నించే గొంతుకలు
ఒక్కటై నినదిస్తున్నాయి
అణిచివేతకు వ్యతిరేకంగా
హక్కుల పరిరక్షణకు
పట్టుదలవుంది
మొండితనముంది
సంకల్పముంది
అర్ధం చేసుకొనే గుణముంది
పోరాటపటిమవుంది
త్యాగాల చరిత్ర ఉంది
ఎదిరించే సత్తా ఉంది
ఆత్మ స్థైర్యం వుంది
విషయ పరిజ్ఞానం ఉంది
ప్రజల మద్దతుంది
పరిస్థితులను అంచనావేసి ఎదిరించే శక్తివుంది
అందుకేనేమో
ప్రభుత్వాలను, పాలకులను
ప్రశ్నిస్తున్నారు, ఉద్యమిస్తున్నారు
సమస్యలపై పోరు చేస్తున్నారు
అన్యాయాలను సహించరు
ఆర్భాటాల జోలికి పోరు
సామాన్య జీవితం వారిది
సంఘ శ్రేయస్సు వారి విధి.