సి పి ఐ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

తిరుమలగిరి 02 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లముల యాదగిరి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన నిరంతరం పోరాటం చేయడమే ఎర్రజెండా లక్ష్యమని, నేటి యువత కమ్యూనిజం వైపు మొగ్గు చూపాలని, అసమానతలు లేని సమాజం వైపు ముందడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలలో కమ్యూనిజంకు గొప్ప చరిత్ర ఉందని , దాని అందిపుచ్చుకొని ముందు తరాలకు చేరేవేయవలసిన బాధ్యత అందరి మీద ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తిపిరాల శ్రీకాంత్, మండల కార్యదర్శి ఎస్ డి ఫయాజ్ మియా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఇక్బాల్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎల్లముల కొమురెల్లి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు జంపాల మల్లయ్య, తొండ రైతు సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు కనుక అశోక్, బోండ్ల వెంకన్న, జంపాల శ్రీను, నాగుల గాని మల్లయ్య, ముత్యాల యాకస్వామి, ఎల్లంల సైదులు , ఎల్లంల కొమురయ్య , కుదురుపాక ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.