తిరుమలగిరిలో ఘనంగా మేడే ఉత్సవాలు

కార్మిక హక్కులను కాపాడుకుంటాం
కొలిశెట్టి యాదగిరిరావు.. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు
తిరుమలగిరి 02 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
చికాగో నగర కార్మికులు చిందించిన రక్తం సాక్షిగా కార్మికుల హక్కులను కాపాడు కోవడానికి కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు పిలుపు ఇచ్చారు. మేడే సందర్భంగా గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించిన భారీ కార్మిక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ చికాగో వీరుల త్యాగ ఫలితమే నేడు ఎనిమిది గంటల పని విధానం అని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పని గంటలను పెంచి కార్మికులను బానిసలుగా చేస్తూ కార్పొరేట్లకు గుప్తా పెట్టుబడిదారులకు లాభాలు గడించడానికి శతకోటీశ్వరుల సంఖ్యను పెంచడానికి దేశ సంపద అంతా కొద్ది మంది వద్ద కేంద్రీకించడానికి కార్మిక వర్గాన్ని శ్రమదోపిడి చేస్తుందని అందులో భాగంగానే నాలుగు లేబర్ కోడులు తీసుకువచ్చి కార్మిక హక్కుల్ని కాలరాస్తుందని విమర్శించారు.వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మికులకు పేద ప్రజలకు సామాజిక భద్రత కల్పించాలని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులైన గిరిజనులను అడవి నుండి పంపించి వేస్తుందని ప్రజల కోసం పనిచేస్తున్న ఎన్కౌంటర్ల పేరుతో అమాయకులను పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపుతుందని చంపడానికి వీరికి ఎవరు అధికారం ఇచ్చారని ప్రశ్నించారు.ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక , కర్షక శ్రమజీవులు అందరూ ఐక్యంగా వర్గ పోరాటాలు నిర్వహించి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సోమన్న ఉప్పలయ్య సోమన్న యాకయ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు