సమిష్టి కృషితో ఏదైనా సాధ్యమే : స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు: సామల ప్రవీణ్

Apr 19, 2025 - 21:39
Apr 20, 2025 - 16:29
 0  16
సమిష్టి కృషితో ఏదైనా సాధ్యమే  : స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు: సామల ప్రవీణ్

చర్ల, ఏప్రిల్ 19 

చర్ల మండల కేంద్రంలో స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ స్థాపించి ఇప్పటికి సంవత్సరం అయిన సందర్బంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సామల ప్రవీణ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ పై ఆధరాభిమానాలు చూపించి, సహాయ సహకారాలు అందించిన చర్ల మండల అధికారులు, రాజకీయ నాయకులకు, ప్రజలు తోటి పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్ లో స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ తరుపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని, సమిష్టి కృషితో కలిసి ఉండే ఏదైనా సాధ్యమేనని అన్నారు. అనంతరం క్లబ్ కమిటీ సభ్యులు అందరూ కలిసి గడిచిన సంవత్సరంలో చేసిన సేవా కార్యక్రమాలు, నూతన సభ్యులను చేర్చుకోవడం, భవిష్యత్ లో జరగబోయే కార్యాచరణ గురించి సంభాషించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తోటపల్లి రమణ(మీ వార్త న్యూస్), కార్యదర్శి చల్లగుండ్ల సతీష్ (కానుక న్యూస్), సహాయ కార్యదర్శి సిరిపురపు నాగేశ్వరరావు(త్రివర్ణ భూమి), ఆర్గనైజింగ్ సెక్రెటరీ సీతారామ్ తిరుమల కుమార్ (తెలంగాణ వార్త), కోశాధికారి గజ్జి అశోక్ (మనసాక్షి గొంతుక), మరక శ్రీను (ఎఎస్ఎన్ 24 న్యూస్) పాల్గొన్నారు.