Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు

హైదరాబాద్: ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి సంవత్సరం, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.inలో చూసుకోవచ్చు.మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా, 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. మార్చి 18 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం చేశారు.