సఖి హాబ్తో మహిళలకు సేవలు డిఈవో విజయలక్ష్మి.

Aug 5, 2026 - 16:28
 0  0
సఖి హాబ్తో మహిళలకు సేవలు డిఈవో విజయలక్ష్మి.

జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- మహిళలకు సఖి హాబ్ సఖీ హబ్ ద్వారా సమీకృత సేవలు అందించడం జరుగుతుందని  జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. బుధవారం  గద్వాల డీఈఓ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ  మహిళల ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారత ఒకే వేదికపై తీసుకోవాలని లక్ష్యం తో సఖి హాబ్ సేవలను విస్తరించడం జరిగిందని తెలిపారు.మహిళలకు ఉచిత ఆరోగ్య సేవల తో సమగ్ర ఆరోగ్య భరోసా,ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి ఆర్థికం గా అభివృద్ధి చెందడానికి నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో రాజకుమార్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు రత్నకుమారి,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333